Analyst దాము Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణాలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. తాజాగా ఈ కేసులో మరొక సంచలనం రేగింది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న సీబీఐ…
వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఈ కేసులో ఇప్పటివరకు ప్రశ్నించిన సాక్షుల నుంచి సేకరించిన ఆధారాలను కోర్టుకి ఛార్జ్ షీట్ ద్వారా ఇచ్చిన సిబిఐ, ముఖ్యంగా ఈ కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ తిప్పారు. ఇక అవినాష్ రెడ్డి కి జగన్ నుండి ప్లాన్ వచ్చినట్లుగా కొన్ని పార్టీల అనుకూల మీడియాలు కథనాలు అల్లుతున్నాయి అంటూ చెప్పారు.

ఇందులో విశ్రాంత ఐపిఎస్ అజయ్ కల్లం రెడ్డి మీడియా ముందు వివేకానంద్ రెడ్డి మరణించిన తరువాత మాట్లాడిన మాటలను పట్టుకుని జగన్ కి ముందే ఎలా తెలుసు అంటూ వాదిస్తున్నారంటూ బాలాజీ తెలిపారు. అయితే ఇక షర్మిల చెప్పిన సాక్ష్యం ప్రకారం రాజకీయ హత్య అని, ఆర్థిక కారణాల కోసం చేసిన హత్య కాదని కూడా బలంగా వినిపిస్తుండగా ఈ కేసులో పార్టీలుగా విడిపోయి ఎవరికి వార తమ అభిప్రాయాలను రుద్దుతున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.