Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి మరణం 2019లో ఎన్నికల ముందు సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటు అంటూ చిత్రీకరించే ప్రయత్నం చేసినా తరువాత రాజకీయ హత్యగా తేల్చారు. అలా అనేక మలుపులు తిరుగుతూ కేసులో ప్రధాన నిందితులుగా దస్తగిరి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి ఉమా శంకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లను కేసులో చేర్చారు సిబిఐ అధికారులు. అయితే కేసులో ఒక్క అడుగు ముందుకు పడలేదు కానీ ఒక్కోరోజు ఒక్కో మలుపు తిరుగుతూ ఆసక్తికర విషయాలు బయటికి వస్తున్నాయి.

పట్టువదలని సునీత రెడ్డి…
వివేకానంద రెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ త్వరగా కేసు తుది దశకు రావాలని నిందితులకు శిక్ష పడాలని వివేకానంద కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారని అందుకే తెలంగాణ హై కోర్ట్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వాలని అభ్యర్థించింది. అయితే ఆల్రెడీ సిబిఐ కోర్ట్ దర్యాప్తు చేస్తుండగా మళ్ళీ మేము కల్పించుకోమని చెప్పడంతో తాజాగా సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించారు సునీత రెడ్డి.

ట్రయిల్ కోర్ట్ కూడా తన తండ్రి కేసును పరిశీలించే విధంగా అనుమతి ఇవ్వాలని గతంలోని కొన్ని కేసులను సాక్ష్యంగా పెట్టి అడిగారు. ఈ పిటిషన్ సోమవారం నాడు హియరింగ్ కి రానుండగా పట్టువదలకుండా సునీత రెడ్డి పోరాడుతున్నట్లు చాలా మంది అనుకుంటున్నారని అనలిస్ట్ బాలాజీ అభిప్రయపడ్డారు. అయితే సునీత రెడ్డి తండ్రి వివేకానంద రెడ్డి బ్రతికి ఉన్నపుడు తండ్రిని పట్టించుకోలేదని, ఆయనతో మాటలు లేవని, ఇక చివర్లో చెక్ పవర్ కూడా లేకుండా చేసి ఆయనను ఇబ్బంది పెట్టారని బాలాజీ తెలిపారు. వివేకానంద హత్య సమయంలో ఆయన రాసిన ఉత్తరం ఎందుకు సునీత, ఆమె భర్త దాచి పెట్టారు అంటూ ప్రశ్నించారు బాలాజీ.