Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరవ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. అయితే తాజాగా బెయిల్ పిటిషన్ మీద కోర్ట్ తీర్పు ఇస్తూ బెయిల్ మంజూరు చేయగా ఈ ఇష్యూ మీద సుప్రీం కోర్ట్ కి సునీత వెళ్ళింది. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అవినాష్ తల్లిని అడ్డం పెట్టుకున్నాడు…
సునీత హై కోర్ట్ లో బెయిల్ మంజూరు అవడంతో సుప్రీం కోర్ట్ లో హై కోర్ట్ తీర్పును పరిశీలించమని పిటిషన్ వేసింది. అవినాష్ రెడ్డి తన తల్లి అనారోగ్యం అంటూ అపద్ధాలు చెబుతున్నాడు. ఆమెకు ఎలాంటి సర్జరీ ఇప్పటి వరకు జరగలేదంటూ కోర్ట్ కి సమర్పించిన మెమోలో ఆమె పేర్కొన్నారు అంటూ బాలాజీ తెలిపారు.

అవినాష్ రెడ్డి అరెస్టు ను సిబిఐ విచారణను తప్పించుకోడానికి తల్లి అనారోగ్యం అంటూ సాకులు చూపుతున్నాడు అంటూ ఆమె పేర్కొన్నారు. అయితే మెడికల్ అప్డేట్స్ ను సుప్రీం కోర్ట్ కోరారు. వాటిని పరిశీలించిన తరువాత బెయిల్ రద్దు చేయడమా లేక హై కోర్ట్ తీర్పును సమర్తించడమా అనేది తెలుస్తుందని బాలాజీ తెలిపారు.