Analyst Damu Balaji : జనసేన అధినేత పిఠాపురంలో ఇచ్చిన స్పీచ్ ను జనసైనికులు ఉహించి ఉండకపోవచ్చు. ఇప్పటివరకు తనకు అధికారం ఇవ్వమని కానీ సీఎం ని చేయండి అని కానీ ఎపుడూ అనని జనసేనాని మొదటి సారి నన్ను సీఎంని చేయండి ప్లీజ్ అంటూ జనాలను కోరుకున్నారు. దోపిడీ దారులకు సీఎం సీటు ఇస్తే ఇలానే దోపిడీ చేస్తుంటారని, నేను బతికుండగా అలాంటి వారికి పదవి రాకుండా చేస్తానంటూ మాటిచ్చారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి ఏపీ ని నెంబర్ వన్ చేస్తా దేశంలోనే అంటూ ప్రకటించారు. వారాహి యాత్రలో భాగంగా పిఠాపురంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ జనసైనికులలో నూతనోత్సహం నింపారు. ఇక జనసేన సైనికులు పార్టీ నాయకులతో మీటింగ్ నిర్వహించిన ఆయన అక్కడ కొంతమంది సుపారీ గ్యాంగులు నన్ను చంపాడానికి వచ్చారు మీరంతా జాగ్రత్తగా ఉండండి అంటూ చెప్పడం ఇప్పుడు హట్ టాపిక్ అయిందంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

పవన్ మాటల వెనుక ఎవరున్నారు…
పవన్ కళ్యాణ్ పూటకో మాట చెబుతూ ప్రత్యర్థులను కన్ఫ్యూస్ చేస్తున్నారని బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆయన మొదటి నుండి సీఎం అవ్వాలని పనిచేయడం లేదు కేవలం చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు. గత ఎన్నికల సమయంలో చూసుకుంటే అప్పుడు లోకేష్ గ్రూప్ నన్ను చంపాలని అనుకుంటున్నారు అంటూ చెప్పాడు. ఇక ఇపుడు వైసీపీ నన్ను చంపించాలని చూస్తుంది వైసీపీ కి నేనే అడ్డం అన్నట్లుగా మాట్లాడుతున్నారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.

2019 ఎన్నికల సమయానికి చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తే వ్యతిరేక ఓటు జగన్ కి వెళ్తుందని చంద్రబాబు ను విమర్శించాడు పవన్. ఇక ఇప్పుడు విడిగా పోటీ చేస్తే జగన్ వ్యతిరేక ఓటు చీలి మళ్ళీ జగన్ వస్తాడనే ఈ సారి చంద్రబాబు తో ఉంటున్నాడు. పవన్ పార్టీని పటిష్టం చేసుకోవాలని కానీ తాను ముఖ్యమంత్రి అవ్వాలని కానీ తక్షణం భావించడం లేదు కేవలం చంద్రబాబు కు మేలు చేయడం లక్ష్యం అంటూ బాలాజీ తెలిపారు.

































