Analyst Damu Balaji : నందమూరి తారకరత్న విషయంలో ఎవరూ ఊహించని విషాదం ఆయన కుటుంబాన్ని కమ్మేసింది. నలభై ఏళ్ల వయసులో ఆయన గుండెపోటుతో మరణించి ఆయన కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టారు. తారకరత్న గారు సినిమాల్లో అంతగా రానించకపోయినా మంచి వాగ్దాటి ఉండటంతో టీడీపీ లో ఈసారి ఎమ్మెల్యేగా పోటీచేయాలని భావించారు. అయితే ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలచినట్లు ఆయన అందరికీ శాశ్వతంగా దూరమయ్యరు. ఆయన వ్యక్తగత జీవితంలోనూ ఇప్పుడిప్పుడే తన ప్రేమ వివాహం వల్ల దూరమైన కుటుంబం మళ్ళీ కలుసుకుంటారు అనుకునే సమయానికి ఆయనే శాశ్వతంగా దూరం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో అలేఖ్య రెడ్డి ఆమె ముగ్గురు పిల్లలకు తారక రత్న అభిమానులు అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారు. ఇక అలేఖ్య రెడ్డి తన భర్తతో ఉన్న మధుర జ్ఞాపకాలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ తారకరత్నను తలచుకుంటున్నారు.

నా పిల్లలు నందమూరి వారసులు…
అలేఖ్య రెడ్డి ఇటీవల తరచుగా సోషల్ మీడియా వేదికగా పోస్ట్లు పపెడితూ తారకరత్న గురించి చెబుతున్నారు. దీని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ ఆమె తమ దుఃఖాన్ని మల్లించడానికి డిప్రెషన్ నుండి బయట పడటానికి సోషల్ మీడియాను ఎంచుకున్నట్లు అనిపిస్తుంది అంటూ తెలిపారు. ఇక పిల్లలు కూడా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం ముఖ్యంగా పెద్దమ్మాయి నిశిక నందమూరి తన తండ్రితో ఉన్న పిక్ లను షేర్ చేస్తుంటుంది.

అయితే ఇక్కడ అలేఖ్య రెడ్డి తన పేరుకు చివర అలేఖ్య తారకరత్న అని మార్చుకోవడం అలాగే పిల్లలకు పేరు చివర నందమూరి అని చేర్చడం చూస్తే వాళ్ళు మీరు వద్దనుకున్నా నందమూరి వారసులే అని చెప్పడం అన్నట్లుగా అనిపిస్తోంది అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. తన భర్త కోరికను నెరవేర్చడానికి అలేఖ్య రెడ్డి రాజకీయాల్లోకి వస్తారా లేక తన రంగమైన ఫ్యాషన్ డిజైన్ వైపు ఉంటారా అనేది ఇప్పటికీ క్లారిటీ లేకపోయినా ఆమె తన పిల్లలను మాత్రం నందమూరి పిల్లలుగానే చూపించడం ఇవన్నీ తన పొలిటికల్ ఎంట్రీ కోసమే అంటూ కొంతమంది అభిప్రాయపడుతున్నారు అంటూ దాము బాలాజీ తెలిపారు.