Analyst Damu Balaji : నెట్ ఫ్లిక్స్ లో సినిమాగా రానున్న విశాఖ ఎంపీ కిడ్నాప్ కథ…. నిర్మాత, డైరెక్టర్ ఎవరంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

0
77

Analyst Damu Balaji :వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ రాజకీయ నాయకుడిగా అలాగే సినిమా నిర్మాత గా కొన్ని సినిమాలను నిర్మించారు. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ మీద అనుచిత వాఖ్యలను చేసి వైరల్ అయ్యారు. అయితే గతంలో అనేక వివాదాలకు కేర్ అఫ్ గా నిలిచారు. ఇక ఆయన తన కుటుంబ సభ్యులను రౌడీ షీటర్ కిడ్నాప్ చేయడం ఏపీ లో చర్చలకు దారితీసింది. ఇక ఈ ఇష్యూ ఇపుడు తెర మీద సందడి చేయనుంది. ఇక ఆ సినిమా గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

కిడ్నాప్ కథ నెట్ఫ్లిక్స్ లో సిరీస్ గా….

విశాఖ లో అధికార పార్టీ ఎంపీ కొడుకు భార్యల కిడ్నాప్ కథ అందరిని ఆశ్చర్య పరిచింది. 58 గంటల పాటు ఇంట్లోనే బండించి డబ్బు డిమాండ్ చేశారు. ఇక కిడ్నాప్ ఎంపీ ఎంవీవి కి తెలిసిన వ్యక్తి అయిన హేమంత్ అనే రౌడీ షీటర్ ఆయన మీద ఉన్న పగ వల్లే ఎంపీ కొడుకును, భార్య,ఆడిటర్ జీ.వి ని కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. ఇక ఈ స్టోరీ అంత ఇపుడు నెట్ ఫ్లిక్స్ లో సిరీస్ గా రాబోతోంది.

వాస్తవంగా జరిగిన సంఘటనలను ఇటీవల కాలంలో నెట్ ఫ్లిక్స్ సిరీస్ గా తీసుకువస్తున్న నేపథ్యంలో ఈ కిడ్నాప్ ఇష్యూ కూడ రాబోతోంది. ఈ సిరీస్ కి ప్రొడ్యూసర్ ఎంపీ ఎంవీవి సత్యనారాయణ గారే కావడం విశేషం. ఇక కోన వెంకట్ స్క్రిప్ట్ పనులను చుసుకుంటుండగా డైరెక్టర్ ఎవరనేది ఇంకా తెలియదు అంటూ బాలాజీ తెలిపారు.