Analyst Damu Balaji : పిహెచ్డి చేసిన భారతికి ఎస్వి యూనివర్సిటీ లో ఉద్యోగం ఇప్పించింది ఎవరంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

0
222

Analyst Damu Balaji : అనంతపురం జిల్లా శింగనమలకు చెందిన సాకే భారతి అనే మహిళ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగ్ వైరల్ అవుతోంది. సాకే భారతి చదువుకు పేదరికం, ఇంట్లోని వాతావరణం ఏమాత్రం అడ్డుకాదని నిరూపించిన తెలుగు మహిళ. ఏకంగా రసాయన శాస్త్రంలో డాక్టరేట్ అందుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. కూలి పనులకు వెళ్తూనే తన చదువుని అశ్రద్ధ చేయకుండా ఎటువంటి అదనపు తరగతులు, కోచింగ్ లేకుండానే బైనరీ మిక్చర్ అనే అంశం మీద పరిశోధనలు చేసి రసాయన శాస్త్రంలో శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ద్వారా డాక్టరేట్ అందుకుంది. ఇక ఆమెకు తాజాగా ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చింది. ఇక ఈ విశేషాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

ఎస్వీ యూనివర్సిటీలో జాబ్ ఎవరిప్పించారంటే…

చిన్న తనం నుండి చదువంటే ఇష్టం ఉన్న సాకే భారతి పదో తరగతి వరకు శింగనమలలో చదివినా అపైన తల్లిదండ్రులకు భారం అవ్వడం వల్ల మేనమామ శివ ప్రసాద్ కి ఇచ్చి పెళ్లి చేసారు. చదువు మీద ఉన్న ఇష్టం తెలిసిన భర్త ఆమెను చదివించారు, అతను కూలీ పనులకు వెళ్తూనే ఆమెను పీజీ వరకు చదివించాడు. ఇక కూలీ పనులకు వెళ్తూనే ఉదయం పని చేసి రాత్రికి చదువుతూ అలా భారతి కష్టపడి పీజీ అయ్యాక అధ్యాపకుల సలహాతో పిహెచ్డి చేయాలని అనుకుంది.

అలా డాక్టర్ ఎంసిఎస్ శుభ వద్ద బైనరీ మిక్చర్ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు భారతి. ఇక ఈమెకు ఎస్కే యూనివర్సిటీలోనే ఉద్యోగం ఇప్పించాలని ప్రయత్నించినా కుదరలేదని దాంతో ఎమ్మెల్సీ కుంభ రవి కుమార్ ఎస్వీ యూనివర్సిటీలో ఉద్యోగం ఇప్పించారని బాలాజీ తెలిపారు. దీనిపై భారతి ఎలా స్పందిస్తారో ఇంకా తెలియాలి అంటూ చెప్పారు.