Analyst Damu Balaji : అనంతపురం జిల్లా పుట్టపర్తి అనగానే సత్య సాయి బాబా గుర్తొస్తాడు. కొన్ని లక్షల విదేశీ, స్వదేశీ భక్తులు ఆయనకు ఉన్నారు. ఇండియా లోనే కాకుండా ఇతర దేశాల నుండి ఆయన కోసం ఇప్పటికీ భక్తులు వస్తూ ఆయన ఆశ్రమం దర్శిస్తుంటారు. ఇక పుట్టపర్తిలో సూపర్ స్పెషలిటీ హాస్పిటల్, విద్యా వైద్య సపదుపయాలను అందరికీ అందిస్తూ బాబా లేకపోయినా ఇప్పటికీ ఆ సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఇక సత్య సాయి బాబా 1926లో జన్మించగా చిన్నతనంలో తేలు కుట్టి మూడు రోజులు లేవలేక పోయాడట. ఆ తరువాత ఆయనలో మార్పులు కనిపించాయని సంస్కృత శ్లోకాలు పలకడం మొదలు పెట్టి వింత ప్రవర్తన చూపించడం, ఆ తరువాత తాను షిరిడి సాయి అవతారం అని చెప్పడం జరిగిందని అనలిస్ట్ బాలాజీ తెలిపారు.

ఆశ్రమంలో ఆరుగురి మీద కాల్పులు…
1918లో బాబా మరణించాక 1926లో పుట్టపర్తి బాబా జన్మించడం, తనని తాను షిరిడి సాయి గా చెప్పడంతో జనాలు ఆయన దర్శనం కోసం క్యూ కట్టారు. ఇక మొదట ఒక తోటలో కూర్చొని జనాలతో కలిసి భజనలు చేస్తూ ఉండే ఆయన జనాల్లో ప్రాచుర్యం పొందాక ఒక్కొక్కటిగా పుట్టపర్తిలో డెవలప్ అయ్యాయి. అటు విదేశీ భక్తులు క్కూడా ఎక్కువయ్యారు అంటూ బాలాజీ తెలిపారు. 1967 ఆ ప్రాంతంలో బాబా కి భక్తులు ఎక్కువయ్యారు. ఆలాగే ఆయనకు రాజకీయ నాయకుల సందర్శనం కూడా ఎక్కువైంది అంటూ బాలాజీ తెలిపారు. ఆయన ఆశ్రమాలను విదేశాల్లో కూడా స్థాపించారు అంటూ చెప్పారు. అయితే బాబా జీవితంలో మాసిపోని మచ్చ 1993 జరిగిన కాల్పులు.

ఆశ్రమంలో ఆరుమంది మీద కాల్పులు జరగడం అప్పట్లో సంచలనం సృష్టించింది అంటూ చెప్పారు. అయితే బాబా ను కత్తితో పొడవడానికి కొందరు ప్రయత్నించగా అడ్డుకున్న వారిని కాల్చారు అంటూ అప్పట్లో ఆశ్రమంలో చెప్పిన కథనాలు జోరు గా వినిపించాయి. ఆశ్రమంలో ఏదో జరుగుతోంది అనే వార్తలు బయటికి వ్యాపించడం బాబా కీర్తి మసకబారడంతో విరాళాలు సేకరించిన డబ్బుతో ఆ చుట్టూ పక్కల ప్రాంతాల్లో తాగు నీరు సౌకర్యం కల్పించారు. అలాగే వైద్య, విద్యా సౌకర్యాలను కల్పించారు అంటూ బాలాజీ తెలిపారు. ఇక ఆశ్రమంలో కాల్పులు ఎవరు ఎందుకు చేసారో ఇప్పటికీ తెలియదని తెలిపారు.