Analyst Damu Balaji : సరూర్ నగర్ కి చెందిన వెంకట సూర్య సాయి కృష్ణ అనే 36 ఏళ్ల వ్యక్తి అక్కడి స్థానిక దేవాలయంలో పూజారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే బిల్డర్ గా ఉన్న సాయి కృష్ణ కు తన తండ్రికి అక్కడి చుట్టుపక్కల మంచి పలుకుబడి ఉంది. ఇక చెన్నై నుండి వచ్చి సరూర్ నగర్ లో స్థిరపడిన అప్సర అనే 30 ఏళ్ల యువతి తన తల్లితో పాటు ఉంటోంది. అప్సర గుడికి వెళ్తుండగా సాయికృష్ణ పరిచయం అవడం ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీయడం జరిగాయి. చివరకు సాయి కృష్ణ అప్సరను హత్య చేసాడు. ఆమె మరితదేహాన్ని మ్యాన్ హోల్ లో పడేసి ఆధారాలను లేకుండా చేసే ప్రయత్నం చేసాడు. ఇక సాయికృష్ణ ఎలాంటి వాడు అనే విషయాలను అక్కడి స్థానికులు తెలిపారు. కానీ సాయి కృష్ణ గురించి నెగెటివ్ గా మాట్లాడలేదు. కానీ గుడి సిబ్బంది మాత్రం సాయి కృష్ణ గురించి కొంత నెగిటివ్ గా మాట్లాడటం జరిగింది. ఆ విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సాయికృష్ణ అమ్మాయిలతో అలా ప్రవర్తించేవాడు…
అనలిస్ట్ దాము బాలాజీ అప్సర హత్య కేసు గురించి మాట్లాడుతూ ఈ కేసులో సాయికృష్ణ గురించి అక్కడి స్థానికులు మంచి సర్టిఫికెట్ ఇచ్చారు అంటూ చెప్పారు. అయితే సాయికృష్ణ పూజారిగా ఉన్న ఆలయ సిబ్బంది మాత్రం సాయి కృష్ణ గురించి నెగిటివ్ గా చెప్పారంటూ బాలాజీ తెలిపారు. సాయికృష్ణ ఒక సైకో అంటూ ఒక సెక్యూరిటీ గార్డ్ చెప్పగా అతను అమ్మాయిలతో చనువుగా ప్రవర్తిస్థాడని తెలిపారు.

ఇక ఇంతకు ముందు వేరే గుడిలో సాయి కృష్ణ ఉండగా అక్కడ చందాలుగా వచ్చిన డబ్బును సొంతానికి వాడుకోవడం వంటివి చేయడం వల్ల అక్కడి నుండి తరిమితే ఈ గుడికి వచ్చాడు అంటూ ఇవన్నీ ఎవరైకైనా చెబితే మా ఉద్యోగాలు పోతాయని చెప్పలేదని, అమ్మాయిలతో కూడా చనువుగా ప్రవర్తించినా అతను పూజారి కాబట్టి ఆ ముసుగులోనే చేసేవాడు అందుకే ఎవరూ పెద్దగా ఏమనేవారు కాదు అంటూ చెప్పారు. ఇక సాయికృష్ణ అప్సర కూడా చనువుగా ఉండటం ఆ అమ్మాయి తరచూ గుడికి రావడం చూసేవారిమని చెప్పారు ఆ సిబ్బంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.































