Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సీఎం జగన్ తానేది స్వయంగా మాట్లాడరు. ఆయన మాట్లాడలనుకునే ప్రతి మాట తన నేతలతో మాట్లాడిస్తారు. అలా కొడాలి నానీ, పేర్ని నానీ, మంత్రి రోజా, అంబటి రాంబాబు, పోసాని వంటి వారు పార్టీలో కేవలం ప్రతి పక్షాలను తిట్టడానీకె పనిచేస్తున్నారు. సినిమా వాళ్ళ నుండి వచ్చే కామెంట్స్ ను తిప్పికొట్టడానికి పోసాని కృష్ణ మురళి గారిని పెట్టుకున్న జగన్ ఆయన ద్వారా పవన్ కళ్యాణ్ ను బాగా విమర్శిస్తుంటారు. అయితే తాజాగా పోసాని చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. తాను మరణిస్తే అంటూ చేసిన కామెంట్స్ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నా శవం సినిమా వాళ్లకు చూపించకండి….
పోసాని గారు ఎపుడు ప్రతిపక్షాల మీద విరుచుకు పడుతూ ఫైర్ అవుతూ ఉంటారు. కానీ తాజాగా అయన నాకు 63 ఏళ్లు ఏ క్షణమైన చనిపోవచ్చు నేను చనిపోతే నా శవం సినిమా వాళ్లకు చూపించకండి అంటూ తన కుటుంబానికి చెప్పారు. అలానే తన భార్యకు కూడ చెప్తూ తనకు మరణిస్తే బాధపడకూడదని అందరికి అన్నం పెట్టి పంపించు అంటూ చెప్పడం ఇపుడు చర్చనియంశం అయిందని బాలాజీ తెలిపారు. నిజానికి పవన్ కళ్యాణ్ మీద చేసిన వాఖ్యలకు పోసాని కుటుంబం మీద గతంలో దాడి జరిగింది. ఆయన ఇంటిని మీద రాళ్లతో దాడి చేసారు.

అయితే ఆ సమయంలో ఆయన, తన కుటుంబం తో అక్కడ లేరు. కొద్ది రోజులు రహస్యంగా ఉన్నారు. ఇక మళ్ళీ జగన్ ప్రభుత్వం 2022 లో సినిమా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చాక అయన మళ్ళీ ఆక్టివ్ అయి పవన్ మీద టీడీపీ మీద కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా చేసిన వాఖ్యలు టీడీపీ, జనసేన కు భయపడి చేసినట్లుగా అనుకోవచ్చని బాలాజీ తెలిపారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఒకవేళ వైసీపీ ప్రభుత్వం రాకపోతే ఆయన పరిస్థితి ఏంటి అనే భయం వచ్చుండొచ్చు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.