Analyst Damu Balaji : భార్యని మూడేళ్ళ కూతురి ముందే టార్చర్… దుబాయ్ లో భర్త వేధింపులు భరించలేక డివోర్స్ ఫోటోషూట్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
293

Analyst Damu Balaji : ఈ మధ్య కాలంలో పెళ్ళికి ఫోటో షూట్, ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, ఇక ప్రెగ్నెన్సీ ఫోటో షూట్ ఇలా రకరకాల ఫోటో షూట్స్ ఎక్కువయ్యాయి. నిజానికి పెళ్లిళ్లు సంప్రదాయ బద్ధంగా కన్నా ఫొటోస్ కోసమే అన్నట్లుగా చేసుకునేవాళ్ళు లేకపోలేదు. అయితే తమిళనాడుకు చెందిన ఒక మహిళ మాత్రం నేను ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తా అంటూ ఏకంగా డోవర్స్ ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట చేసింది. అదేదో పబ్లిసిటీ కోసమో మరింకేదాని కోసమో ఆమె అలా చేయలేదు. ఆ ఫోటో షూట్ వెనుక ఆమె పడిన బాధ వేదన ఉన్నాయంటూ విశ్లేషకులు దాము బాలాజీ వివరించారు.

షాలిని నాలుగేళ్ళ టార్చర్ కి విముక్తి…

తమిళనాడుకి చెందిన షాలిని మోడల్ గా నటిగా రానిస్తూ సీరియల్స్ లో మంచి పేరు సంపాదించుకుంది. అయితే మొదట పెళ్లి చేసుకుని సెట్ అవ్వక 3 నెలలకే భర్తతో విడిపోయింది. ఆ తరువాత ఒక ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లగా అక్కడ రియాజ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే అప్పటికే పెళ్లి అయిన రియాజ్ ను అతని భార్య టార్చెర్ చేస్తోందని చెప్పి సానుభూతి కార్డు వాడటంతో ప్రేమించిన షాలిని అతడిని చెన్నై లో హిందు సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. పెళ్ళైన వారం నుండే కొట్టడం టార్చర్ చేయడం మొదలు పెట్టిన రియాజ్ పాప పుట్టాక కూడా ఆపలేదు. కానీ షాలిని కి మాత్రం రియాజ్ అంటే ఇష్టం అందుకే అతడి టార్చెర్ ను భరించింది. అలాగే అప్పటికే ఒకసారి విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకోవడం వల్ల మీడియా అలాగే తన బంధువులు మరోసారి విడాకులు తీసుకుంటే ఎలా చూస్తారో అనే భయంతో భరించింది అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు. ఇక కూతురు రియా ముందు కూడా కొట్టడంతో భరించలేక షాలిని రియాజ్ ను ఎదిరించింది. అయితే విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోని రియాజ్ తో చివరికి విడాకులు తీసుకుని వేరు పడింది.

రక్తం వచ్చేలా కొట్టే రియాజ్ అలా రక్తం వచ్చినా నీ వల్లే నేను రక్తం వచ్చేలా కొట్టాల్సి వస్తోంది అంటూ మళ్ళీ కొట్టేవాడట. అలాంటి ఒక శాడిస్ట్ ని నాలుగేళ్లు ఎందుకు భరించావు అంటే షాలిని చెప్పే సమాధానం ప్రేమ, సమాజం వీటివల్లే భరించాను అంటుంది. అందుకే ఆమె డివోర్స్ తీసుకున్నాక దాన్ని సెలెబ్రేషన్స్ చేసుకోవాలని అనుకుంది. దాని ద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవడం కాదు, తనలా ఉన్న ఆడవాళ్లకు తెలియజేయాలని అనుకుందట షాలిని. ఇక బాలాజీ గారు ఆమె గురించి చెబుతూ షాలిని మహిళలకి ఇచ్చిన సలహా ఒకటే పెళ్ళైన మగాడిని మాత్రం ప్రేమించొద్దు అని అంటూ తెలిపారు.