Analyst Damu Balaji : మళ్ళీ డుమ్మా కొట్టిన ఎన్టీఆర్… తాత ఫంక్షన్స్ అన్నింటికీ దూరంగా జూనియర్… ఎందుకిలా…: అనలిస్ట్ దాము బాలాజీ

0
32

Analyst Damu Balaji : తాత వారసత్వం పునికి పుచ్చుకుని తాత పేరుతో పాటే పోలికలు, అభినయం అందుకుని ప్రస్తుతం ఉన్న టాప్ హీరోస్ లో ఉన్న నందమూరి చిన్నోడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ సినిమాల్లో తన తాత కు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. అయితే ఆ తాత నందమూరి ఎన్టీఆర్ కి సంబంధించిన ఎటువంటి వేడుకల్లో ఇటీవల కనిపించకపోవడం నందమూరి అభిమానుల్లో అనుమానలకు తావిస్తోంది. సినిమాల వరకే తాత పంపేరు చెప్పుకుంటారా నిజ జీవితంలో పట్టించుకోరా అంటూ ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిన ఆయన వెళ్ళలేదు. తాజాగా ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా కేంద్ర ప్రభుత్వం 100 రూపాయల నాణెం విడుదల చేసింది. ఈ వేడుకలోనూ జూనియర్ కనిపించలేదు. ఇక ఈ ఇష్యూ మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మళ్ళీ డుమ్మా కొట్టిన జూనియర్….

ఎన్టీఆర్ శత జయంతి సందర్బంగా ప్రస్తుతం బీజేపీ లో కొనసాగుతున్న ఎన్టీఆర్ గారి కుమార్తె పురందేశ్వరి చొరవ తో ఆర్బిఐ 100 రూపాయల నాణెం ను విడుదల చేసింది. రాష్ట్రపతి ద్రౌపది మూర్ము గారు విడుదల చేయగా ఈ వేడుకలో నందమూరి కుటుంబ సభ్యులు పలువురు ప్రముఖులు టీడీపీ శ్రేణులు పాల్గొనగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ కి కూడ ఆహ్వానం అందిన వారు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఎన్టీఆర్ ఇటీవల కాలంలో టీడీపీ పార్టీ కి అలాగే ఎన్టీఆర్ కి సంబంధించిన వేడుకలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య హెల్త్ యూనివర్సిటీ పేరు ను సీఎం జగన్ మార్చినపుడు కూడ ఆయన ముక్తసరిగా స్పందించారు. ఈ వైఖరి పట్ల తారక్ మీద నందమూరి అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఇక ఈయన పిలిచినా రాకపోతే, ఇక పిలిస్తే నేను వచ్చేదాన్ని ఆయన భార్యగా నాకు హక్కు ఉంది అంటూ లక్ష్మి పార్వతి మరోవైపు పురందేశ్వరి మీద విరుచుకుపడ్డారు అంటూ బాలాజీ తెలిపారు.