Analyst Damu Balaji : మహేష్ బాబు కుక్క చనిపోతే మీడియా ఎందుకు ఏడుస్తోంది … ఇదేం జర్నలిజం….: అనలిస్ట్ దాము బాలజి

0
73

Analyst Damu Balaji : సోషల్ మీడియా ఒకవైపు ఎలాంటి వార్త అయినా వైరల్ చేసేస్తుంటే మరోవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అలానే తయారైంది. జనాలకు ముఖ్యమైనవి, ఉపయోగపడే వార్తలను వేయడం ఎపుడో మానేసింది. ఒకప్పుడు సెలబ్రిటీలా గురించి తెలుసుకోవాలంటే మ్యాగ్జన్స్ ఉండేవి. ఇపుడు మన న్యూస్ ఛానెల్స్ లోనే అనవసరపు, నిజ నిర్ధారణ లేని వార్తలను బ్రేకింగ్ న్యూస్ అంటూ రోజంతా వేసి జనాల మీద రుద్ధుతున్నారు. పైగా జనాలు చూసేవాటికి ప్రాముఖ్యం ఇస్తున్నాం అంటున్నారు. అయితే జనాలు మాత్రం వాళ్లు వేస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా జర్నలిజం వ్యాపారమయం కావడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతి న్యూస్ ఛానెల్, పత్రిక రేటింగ్స్, సర్క్యూలేషన్ పోటీలో కొట్టుకుపోతు విలువలు మర్చిపోతున్నాయి. తాజాగా ఒక వార్త మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానెల్ వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది దాని గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మహేష్ బాబు కుక్క చనిపోతే ఏడుస్తున్న మీడియా….

తాజాగా మహేష్ బాబు గారి ఇంట్లో వాళ్ళు పెంచుకుంటున్న ప్లుటో అనే కుక్క చనిపోయింది. ఏడేళ్లుగా పెంచుకుంటున్న కుక్క చనిపోయిందుకు సితార ఇంస్టాగ్రామ్ ద్వారా తన బాధను షేర్ చేసుకుంది. ఇక నమ్రత కూడా కూతురు పోస్ట్ కి కామెంట్ చేస్తూ ఎప్పటికి తనని గుర్తుంచుకుంటాం అంటూ చెప్పారు. అయితే ఈ న్యూస్ ను వేస్తూ జనాల సహనాన్ని పరీక్షిస్తున్నాయి మన ఛానెల్స్ అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆ మధ్య రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పాప పుట్టినపుడు, పేరు పెట్టినపుడు కూడా ఇలానే హంగామా చేసింది మీడియా అంటూ బాలాజీ తెలిపారు.

అయితే అపుడు ఇపుడు కూడా జనాల నుండి వినిపిస్తున్న మాట ఇలాంటి పనికిరాని వార్తలు మాకెందుకు అని విసుకుంటున్నారు. దేశంలో ఎన్నో జరుగుతున్నాయి అలాంటి వాటిని కవర్ చేయకుండా ఇలాంటి సెలబ్రిటిల ఇళ్లలో జరిగే చిన్న విషయాలను ఫోకస్ చేయడం ఏమిటని అభిప్రాయాపడుతున్నారు. కానీ నేడు మీడియా అంత వ్యాపార మయం అయినా తరుణంలో అవసరమైన వార్తలు ప్రసారం కావంటు బాలాజీ అభిప్రాయపడ్డారు.