Analyst Damu Balaji : మాజీ మంత్రి నారాయణ మీద కుట్ర… ప్రియా షాకింగ్ కామెంట్స్ వెనుక వాస్తవాలు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
170

Analyst Damu Balaji : గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ గారి మీద లైంగిక ఆరోపణలను చేస్తూ ఒక మహిళ వైరల్ అయ్యారు. ఇంస్టాగ్రామ్ ద్వారా నారాయణ గారి మీద ఆరోపణలను చేసిన ఆ మహిళ ఎవరో కాదు ఆయన తమ్ముడి భార్యే. ఆమె క్యాన్సర్ తో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా తన తమ్ముడి భార్యే లైంగిక ఆరోపణలను చేయడంతో సంచలనం రికేత్తించిన ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

ఆమె ఆరోపణలలో వాస్తవాలు ఎంత…

నారాయణ గారి తమ్ముడు సుబ్రహ్మణ్యం గారి భార్య ప్రియ తాను ఇరవై తొమ్మిదేళ్లుగా పడుతున్న బాధను చెప్తున్నానంటూ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తనను నారాయణ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆరోపించారు. తనకు చిన్నతనం నుండి అందంగా రెడీ అవడం ఇష్టమని అలా అలంకరించుకొని నారాయణ ను రెచ్చగొడుతున్నావని మా ఇంట్లో వాళ్ళు పాత చీరలు కట్టుకుని ఉండు అని చెప్పేవారు అంటూ ప్రియా ఆరోపించారు. ఇక ఈ విషయం గురించి బాలాజీ మాట్లాడుతూ ఆమె చేసిన ఆరోపణలను ఇప్పటికీ ఇంకా నారాయణ కుటుంబంలోని ఎవరూ స్పందించలేదు.

కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా నారాయణ ఉంటున్నారు. ఆయన మళ్ళీ నెల్లూరు రాజకీయాళ్లలో ఆక్టివ్ అయ్యాక ఇలాంటి ఆరోపణలు ఎదురవుతున్నాయి. వైసీపీ పార్టీనే ఇలాంటి ఆరోపణలను చేయిస్తోందని కొంతమంది భావిస్తున్నారు. ప్రియా ఇలాంటి విషయాలను చెప్పే సమయంలో నవ్వుతూ మాట్లాడటం అవన్నీ కూడా వింతగా అనిపిస్తాయి. అన్నేళ్ల నుండి బాధ అనుభవిస్తున్నా అన్నపుడు ఆ బాధ కనిపించడం లేదని బాలాజీ అభిప్రాయపడ్డారు. చివర్లో ఏడుస్తూ చెబుతున్న ఆమె చెప్పే వాటిలో ఎంత వరకు వాస్తవాలు ఉన్నాయో ఆయన కుటుంబ సభ్యులే తేల్చాలి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.