Analyst Damu Balaji : మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన వరుణ్ తేజ్… పెళ్లి గురించి అప్డేట్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
45

Analyst Damu Balaji : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంట కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలలో నటించారు. ఆ సినిమాలో పెద్దగా హిట్ కాకపోయినా వీరి లవ్ స్టోరీ మాత్రం బాగా హిట్ అయింది. పెద్దలను ఒప్పించుకుని ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు. జూన్ 9వ తేదీన ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. ఇక పెళ్లి గురించి రకరకాల వార్తలు బయటికి వస్తున్నాయి. ఒకవైపు పెళ్లి క్యాన్సిల్ అవునుందని వినిపిస్తుండగా తాజాగా వారి పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు.

పెళ్లి జరిగేది అక్కడే…

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఇద్దరూ మిస్టర్ సినిమా టైములో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. ఇక వారి ప్రేమ ఇటలీ లో మొదలయినందుకు గుర్తుగా ఇటలీ లోనే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారంటూ బాలాజీ తెలిపారు. మెగా ఫ్యామిలీలో పెళ్లి చాలా గ్రాండ్ గా చేస్తారు కానీ వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వాళ్ళ పెళ్లిని కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోనున్నారు.

తొలత వీరి పెళ్లి డిసెంబర్ లో జరుగుతుందని అందరూ భావించినా సినిమాలతో మిగిలిన వారి వ్యక్తిగత ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆగష్టు లోనే వాళ్ళ పెళ్లి జరగనుంది అంటూ చెప్పారు బాలాజీ. ఇక వారి పెళ్లి అత్యంత సన్నిహితులైన బంధువుల మధ్య ఇటలీలో జరగబోతోంది, అయితే అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది అంటూ చెప్పారు.