Analyst Damu Balaji : మెగా అల్లుడిగా తరుణ్… పెళ్లేప్పుడంటే… వార్తల్లో నిజమెంత…: అనలిస్ట్ దాము బాలాజీ

0
126

Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఏమీ జరగకపోయినా ఒక వార్త అలా బయటికి వచ్చిందంటే దాన్ని అల్లుకుని పుంఖలుపుంఖలుగా వార్తలు పుట్టుకొస్తాయి. అందులో నిజం ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతాయి. అలా తాజాగా హీరో తరుణ్ మెగా ఇంటికి అల్లుడిగా అవ్వబోతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఆ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

మెగా ఇంటికి అల్లుడిగా తరుణ్…

హీరో తరుణ్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. బాల నటుడుగా మొదలయిన తరుణ్ కెరీర్ హీరోగా మంచి విజయాలను చూసి అప్పట్లో టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నా మధ్యలో ఒక్కసారిగా కెరీర్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం సినిమాలను చేయకుండా బాగా గ్యాప్ ఇచ్చిన తరుణ్ నాలుగు పదుల వయసు వస్తున్నా ఇంకా పెళ్లి చేసుకోలేదు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తరుణ్ తల్లి నటి రోజా రమణి తరుణ్ పెళ్లి గురించి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలోని ఒక పెద్ద కుటుంబానికి అల్లుడవుతున్నాడని హింట్ ఇవ్వడంతో అది మెగా ఇంటికే అంటూ వార్తలు వ్యాపించాయని బాలాజీ తెలిపారు. నిజానికి ఈ వార్తకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా గాసిప్స్ సృష్టిస్తున్నారని ఇటీవలే నాగబాబు కుమార్తె నిహారిక విడాకులు తీసుకోగా ఆమెతో తరుణ్ పెళ్లి ఉండొచ్చని అనుకుంటున్నారు. ఇక మరో మెగా డాటర్ శ్రీజ కూడా విడాకులకు రెడీ అవ్వగా ఇంకా ఆఫీసియల్ గా రాలేదు. అందుకే నిహారికతో తరుణ్ పెళ్లి ఉండొచ్చనే వార్తలను బలంగా ప్రచారం చేస్తున్నారని బాలాజీ అభిప్రాయపడ్డారు.