Analyst Damu Balaji : మెగా ఫ్యామిలీలో అవార్డుల పంట… ఇందులో మోడీ హస్తముందా…: అనలిస్ట్ దాము బాలాజీ

0
33

Analyst Damu Balaji : 2021 సంవత్సరం కి గాను తాజాగా ప్రకటించిన 69 వ జాతీయ అవార్డులలో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా 11 అవార్డులను కోల్లగొట్టింది. ఇక ఇప్పటివరకు ఏ తెలుగు హీరోకి రాని గౌరవం అల్లు అర్జున్ కి దక్కింది. జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకి గాను అవార్డు వచ్చింది. ఇదిలా ఉంటే పుష్ప సినిమాకు అలాగే ట్రిపుల్ ఆర్ సినిమా, ఉప్పెన, కొండ పొలం ఇలా మెగా ఫ్యామిలీ హీరోస్ ఉన్న సినిమాలకు అవార్డులు రావడంతో పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య ఆస్కార్ అవార్డు ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చినపుడు రాజమౌళి అవార్డులు కొన్నాడంటూ విమర్శించిన చాలా మంది నేడు పుష్ప సినిమాకు బన్నీ కి అవార్డు వచ్చిన అలాగే లాబీయింగ్ అంటున్నారు. రాజకీయకోణం ఉందంటున్నారు. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.

మెగా ఫ్యామిలీ కి అవార్డుల వెనుక మోడీ….

అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ నిజానికి చాలా మంది అవార్డులనేవి ఇస్తే రావు తెచ్చుకుంటే వస్తాయి అని అంటారు. అంటే లాబీయింగ్ చాలా ముఖ్యం అని దాని అర్థం అంటూ చెప్పారు. అయితే అన్ని సార్లు అలానే అవార్డులు రావు కొన్నిసార్లు ప్రతిభ ఆధారంగాను అవార్డులు వస్తాయి. అయితే మోడీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ అవార్డులను చూసిన అందులో రాజకీయ కోణం కనిపిస్తోంది.

అందుకే ఇపుడు ప్రకటించి జాతీయ అవార్డుల విషయంలో కూడా అలానే చాలా మంది ఆలోచిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ కి సౌత్ చాలా కీలకం గా ఉంది. అందులోనూ తెలంగాణ మీద కొద్దిగా ఆశలు ఉన్నాయ్. అందువల్లే మెగా ఫ్యామిలీని మచ్చిక చేసుకుంటే వారికున్న ఫ్యాన్ బేస్ ఉపయోగపడుతుందని మోడీ భావించి ఉంటాడని కొంత మంది భావిస్తున్నారు. అయితే వీటిలో ఎంత వరకు నిజాలు ఉన్నాయన్నదీ చెప్పలేము అంటూ బాలాజీ తెలిపారు.