Analyst Damu Balaji : మొదట్లో నన్ను చూసి నిర్మాతలు పారిపోయారు… కానీ చిరంజీవి గారు ఒక్కరే… తన ఎమోషనల్ జర్నీ చెప్పిన అల్లు అర్జున్..: అనలిస్ట్ దాము బాలాజీ

0
24

Analyst Damu Balaji : టాలీవుడ్ లో ఫ్యాషన్, స్టైల్ లకు మారు పేరు అంటే అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. గంగోత్రి సినిమాతో మొదలు పెట్టి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక కేరళలో అల్లు అర్జున్ అక్కడి టాప్ హీరోలు అయిన మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారితో సమానంగా అభిమానులు వున్నారు. అక్కడ అల్లు అర్జున్ ని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అలా పక్క రాష్ట్రంలో కూడ అభిమానులను సంపాదించిన ఈతరం నటులలో ముందుండేది బన్నీ. వరుసగా హిట్లందుకుంటున్న బన్నీ తాజాగా జాతీయ ఉత్తమ హీరోగా తొలి తెలుగు హీరోగా నిలబడి తన కెరీర్ లో మైలు రాయిని చేరుకున్నాడు. ఇక ఈ అవార్డు ప్రకటించినప్పటి నుండి బన్నీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతుండగా తాజాగా తన జర్నీ గురించి అల్లు అర్జున్ మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ గురించి అనలిస్ట్ దాముబాలాజీ మాట్లాడారు.

నాతో సినిమా అంటే నిర్మాతలు పారిపోయేవారు…

అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడం గురించి మాట్లాడుతూ తాను చిన్నప్పటీ నుండి చదువులోనూ, స్పోర్ట్స్ లోను పూర్ స్టూడెంట్ అంటూ చెప్పుకోచ్చారు. ఇంట్లో తల్లిదండ్రులు అందరూ వీడి భవిష్యత్ ఏమిటి అని బయపడేవారు. నేను స్కూల్ అలాగే కాలేజీ లో మాత్రం సాంస్కృతిక పోటిల్లో పాల్గొనే వాడిని జీవితంలో ఫెయిల్యూర్ అనుకున్న నాకు అపుడే అర్థమైంది నాలో ఒక నటుడు ఉన్నాడు అని అంటూ అల్లు అర్జున్ తెలిపారు. ఇక మొదట సినిమాల్లోకి రావాలని అనుకున్న ఒక పెద్ద బ్యానర్ సినిమా చేయాలనీ అనుకున్న నన్ను చూసాక వద్దనుకున్నారు . మొదట చిరంజీవి గారే నాకు అవకాశం ఇచ్చారు, డాడీ సినిమాలో నటించాక నాకు గుర్తింపు వచ్చింది. ఇక నాన్న, చిరంజీవి గారే స్వయంగా సినిమా చేయాలనీ బడ్జెట్ ఇబ్బంది అవుతుందని భావించి ఆలోచిస్తున్న సమయంలో రాఘవేంద్ర రావు గారి గంగోత్రి సినిమా గురించి తెలిసి అందులో అవకాశం ఇప్పించారు నాన్న, మావయ్య అంటూ అల్లు అర్జున్ తన తొలి ప్రయాణం గురించి చెప్పారు.

ఇక ఆ సినిమా హిట్ అయినా నన్ను చాలా మంది కామెంట్స్ చేసారు. దీంతో మళ్ళీ నాకు ఆఫర్స్ రాలేదు. అసమయంలోనే దిల్ రాజు గారు కొత్తవాళ్ళతో కలిసి ఆర్య సినిమా అనుకున్నారు. అలా సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమాతో నా లైఫ్ టర్న్ అయింది అంటూ బన్నీ చెప్పారు. ప్రతి జీవితంలో ఫెయిల్యూర్స్ ఉంటాయి కానీ మనలో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో తెలిస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని బన్నీ నిరూపించాడంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. తాను ఓక నిర్మాత కొడుకు అయినా కూడ సక్సెస్ అంత ఈజీ గా రాలేదు కష్టపడ్డాడు కాబట్టే ఈరోజు జాతీయ ఉత్తమ నటుడు అయ్యాడు అంటూ బాలాజీ తెలిపారు. బన్నీ జర్నీ నేటి యువకులకే కాదు తల్లిదండ్రులకు అవసరం. పిల్లలు చదవడం లేదనో ఇంకెందులోనూ రానించలేదని వారిని పనికిరాని వాళ్ళు అనుకుంటే పొరపాటు. వాళ్లలో ఉన్న ఆసక్తి, టాలెంట్ ను గమనించి ఆదిశగా వారిని ప్రోత్సాహించాలి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.