Analyst Damu Balaji : రహస్యంగా భేటీ అయిన అవినాష్ రెడ్డి, భారతి రెడ్డి… వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకున్నారు…: అనలిస్ట్ దాము బాలాజీ

0
436

Analyst Damu Balaji : 2019 ఎన్నికల ముందు రాష్ట్రంలో సంచలనం రేపిన హత్య కేసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. తన ఇంట్లోనే రాత్రి బాత్రూంలో శవమై కనిపించారు వివేకానంద రెడ్డి. ఈ హత్య మీద విచారణ తొలుత రాష్ట్ర పోలీసులు చేసినా కేసును తప్పుదోవ పట్టిస్తున్నారనే అనుమానంతో వివేకానంద రెడ్డి కూతురు సునీత గారు కోర్ట్ ను ఆశ్రయించి పక్క రాష్ట్రం అయిన తెలంగాణ సిబిఐ కి ట్రాన్సఫర్ చేయించుకున్నారు. జగన్ సొంత బాబాయ్ హత్య, రాజకీయంగా ప్రకంపణలు రేపుతున్నా ఇప్పటికీ అసలు నేరస్థులు బయటికి రాలేదు. కేసులో ఇప్పటివరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని సిబిఐ ఆరాటపడినా అది జరగలేదు. ఇక తాజాగా జరుగుతున్న పరిణామాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

సీక్రెట్ గా మాట్లాడుకున్న అవినాష్, భారతి…

వివేకానంద రెడ్డి హత్య కేసులో మొదటి నుండి సిబిఐ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి చుట్టూనే తిరుగుతోంది. మొదట్లో అవినాష్ రెడ్డి కాల్ లిస్ట్ లో హత్య జరిగిన రోజు భారతి రెడ్డి పిఏ నవీన్ అలాగే జగన్ పిఏ తో మాట్లాడినట్లు ఆధారాలు దొరకడం, అలాగే భారతి రెడ్డితో చాలా సేపు మాట్లాడినట్లు సిబిఐ ఆరోపిస్తోంది.

అయితే తాజాగా అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపిస్తున్నా సిబిఐ మాత్రం అరెస్టు చేయలేదు కానీ భారతి రెడ్డి తో అవినాష్ రెడ్డి రహస్యంగా కలిసి ఏదో మాట్లాడినట్లు వార్తలు బయటికి వినిపిస్తున్నాయి. నిజానికి సిబిఐ నెక్స్ట్ టార్గెట్ అవినాష్ రెడ్డి తరువాత భారతి రెడ్డి అంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అందుకే అవినాష్ అరెస్టు నేపథ్యంలో భారతి రెడ్డిని కలిసాడని, నెక్స్ట్ ఆమెను కూడా విచారణకు సిబిఐ పిలిచే అవకాశం లేకపోలేదని బాలాజీ అభిప్రాయపడ్డారు.