Analyst Damu Balaji : వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరిగి మళ్ళీ అవినాష్ రెడ్డి అరెస్టు దగ్గరే ఆగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద ను హత్య చేయించారని ఈ కేసులో మొదటి నుండి ఆయనను అరెస్టు చేయాలని వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత రెడ్డి కోరుకుంటున్నారు. అయితే ఎప్పటికప్పుడు కేసులో అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండగా తాజాగా సుప్రీం కోర్ట్ ను సునీత్ రెడ్డి ఆశ్రయించారు. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ సునీత కు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోందని అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

హై కోర్ట్ కి వెళ్లామన్న సుప్రీం కోర్ట్…
వివేకానంద హత్య తరువాత ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని సునీత కేసును సిబిఐ కి అప్పగించాలని కోరగా అలాగే ఏపీ హై కోర్ట్ నుండి కేసును తెలంగాణ హై కోర్ట్ కి కేసు బదిలీ చేయించుకున్న సునీత ప్రస్తుతం అక్కడ నుండి సుప్రీం తలుపు తట్టారు.

అయితే సుప్రీం కోర్ట్ కేసును ఆల్రెడీ హై కోర్ట్ చూస్తున్నదున కల్పించుకోమని చెప్పగా సునీత తరుపున లాయర్లు సుప్రీం కోర్ట్ విచారించాలని కోరారు. దీంతో తీర్పును నేటికి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. అయితే తాజాగా సుప్రీం కోర్ట్ లోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం హై కోర్ట్ లోనే ఈ కేసును తేల్చుకోవాలని సునీత కి చెప్పినట్లు తెలుస్తోందని బాలాజీ అభిప్రాయపడ్డారు.


































