Analyst Damu Balaji : వివేకానంద కేసులో సిబిఐ ను ఆడిస్తున్న రఘు రామ కృష్ణం రాజు..? అనలిస్ట్ దాము బాలాజీ

0
191

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏమాత్రం పురోగతి కనిపించకపోయినా కేవలం రాజకీయంగా మాత్రం అటు వైసీపీ ఇటు టీడీపీ పార్టీల విమర్శలు ప్రతి విమర్శలకు పనికొస్తోంది. ఒకవైపు సునీత రెడ్డిని అడ్డం పెట్టుకుని టీడీపీ వివేకానంద రెడ్డి కేసును వాడుకుంటోందసని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తుంటే మరోవైపు జగన్ సొంత బాబాయ్ ని హత్య చేయించాడు అంటూ టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఎపుడు తెలుస్తాయో తెలియదు కానీ ఎవరికి వారు కోర్టులను, సిబిఐ వంటి వ్యవస్థలను విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. సిబిఐ అధికారుల విచారణను కొంతమంది తప్పు పడుతుంటే ప్రభుత్వంకి అనుకూలంగా న్యాయమూర్తులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాల విమర్శల నడుమ స్వపక్షంలో విపక్షంలా మారిన రఘు రామ కృష్ణ గారు ఈ కేసులో మరీ ఎక్కువగా టీవీ డిబేట్స్ లో పాల్గొని మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సిబిఐ ను మేనేజ్ చేస్తున్న ఆర్ఆర్ఆర్…

అనలిస్ట్ దాము బాలాజీ వివేకానంద హత్య కేసు గురించి మాట్లాడుతూ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు గారు ఈ కేసు గురించి టీడీపీ అనుకూల మీడియాలో డిబేట్స్ లో పాల్గొంటూ అవినాష్ ను జైల్లో పెడతారు అంటూ హై కోర్టు జడ్జి అమ్ముడుబోయాడంటూ విమర్శిస్తున్నారు. మరో వైపు ఢిల్లీ నుండి సిబిఐ ని ఈయన మేనేజ్ చేస్తున్నారనే ప్రచారం వినిపిస్తోందని చెప్పారు.

బీజేపీ పెద్దలతో ఉన్న సత్సంబంధాల కారణంగా సిబిఐ అధికారులను ప్రభావితం చేస్తూ కేసులో అవినాష్ ను టార్గెట్ చేసి జగన్ కి తలనొప్పి తేవాలనే ఉద్దేశం ఉందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. టీడీపీ లీడర్ల కంటే ఎక్కువగా మీడియా డిబేట్స్ లో మాట్లాడుతూ కనిపిస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎంపీ గా ఆయన నియోజకవర్గం పనులు మానుకొని నిరంతరం టీవీ డిబేట్స్ లో కనిపిస్తున్నారంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.