Analyst Damu Balaji : శరత్ బాబు కుటుంబంలో ఆస్తి గొడవలు… అంత్యక్రియల విషయంలో సంధిగ్ధం…: అనలిస్ట్ దాము బాలాజీ

0
21

Analyst Damu Balaji : హీరోగాను, విలన్ గాను, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు శరత్ బాబు గారు అనారోగ్య సమస్యలతో చికిత్స అందుకుంటూ తుది శ్వాస విడిచారు. దాదాపు నెల పైగానే హాస్పిటల్ లో ఉన్న ఆయన చెన్నై నుండి బెంగళూరు ఆ తరువాత హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. 72 ఏళ్ల వయసులో శరత్ బాబుగారు మృతి చెందారు. ఆయన సినిమా ఇండస్ట్రీ కి వచ్చాక నటి రమప్రభ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల తరువాత విడిపోయిన ఆయన మళ్ళీ తమిళ నటిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న శరత్ బాబు గారికి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు దాదాపు 13 మంది ఉన్నారు.ఇక వారి కుటుంబ గురించి ఆస్తి గొడవల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

ఆస్తి విషయంలో గొడవలు….

శరత్ బాబు గారికి సంతానం లేకపోవడం వల్ల ఆయన అన్నదమ్ముల పిల్లలను చేరదీసారట. వారి చదువులు అన్ని విషయాలు ఆయనే చూసుకుని ఆస్తి కూడా 13 భాగలను చేసి అందరికి పంచారట. తనకంటూ కొంత ఆస్తి పెట్టుకుని మిగిలినది అందరికి ఇచ్చేసిన ఇప్పుడు మిగిలిన ఆస్తి కోసం చిన్న గొడవలు జరుగుతున్నాయానే పుకార్లు వినపడుతున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

ఇక శరత్ బాబు గారి అన్న కొడుకు ఆయుష్, శరత్ బాబు గారికి తల కొరివి పెడతాడు అని సమాచారం ఉంది అంటూ చెప్పారు. అయితే ఆస్తి విషయం తెలిసే వరకు అంత్యక్రియలు జరపరాదని అనుకుంటున్నారని హాస్పిటల్ లో కూడా చూసుకునే విషయంలో పోటీలు పడ్డారని దాముబాలాజీ వివరించారు. అయితే ముందు నుండి శరత్ బాబు గారి అన్న కొడుకు అలానే ఒక సోదరి ఆయనను చూసుకున్నారని అందరు చెబుతున్నారని చెప్పారు.