Analyst Damu Balaji : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమం వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరచిన 39 ఏళ్ల సాయి చంద్ నాడు గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగల్చింది. ఆయన మరణించిన తరువాత ఆయన భార్య సరిగా ఆహారం తీసుకోకుండా బాధపడుతూ ఉండటం గుండెపోటు రావడం వల్ల ఆమె కూడా హాస్పిటల్ లో జాయిన్ అయింది. ఇక సాయి చంద్ కుటుంబాన్ని సీఎం కెసిఆర్ పరామర్శించారు.

సాయి చంద్ కుటుంబానికి అండగా కెసిఆర్…
మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న సాయి చంద్ అలాగే ఆయన తండ్రి ప్రస్తుతం దుఃఖంలో ఉండటం వల్ల వారి కుటుంబానికి కెసిఆర్ ప్రభుత్వం అండగా నిలబడింది. సాయి చంద్ మరణించక ముందు నామినేషన్ పదవి అయిన గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉండగా ఆ పదవిని ఆయన భార్య రజనికి అప్పగించారు. అలాగే పిల్లల పేరిట చెరో 25 లక్షలు డిపాజిట్ చేయించారు. అలాగే సాయి చంద్ తండ్రి కూడా ఉద్యమ కారుడు కావడం వల్ల ఆయనకు ఆయన చెల్లికి ఇద్దరికీ చెరో 25 లక్షలు డిపాజిట్ చేసారు. ఇక రజని గారి ఒకటిన్నర కోటి డబ్బులను ఇచ్చారు. ఇక కేటీఆర్, కవిత కూడా సాయి చంద్ కుటుంబాన్ని పరామర్శించారు.

ఇవన్నీ ప్రభుత్వం తరుపున కాకుండా పార్టీ నుండి అందరితో సేకరించి నెల జీతాలను సాయి చంద్ కుటుంబానికి విరాళంగా ఇప్పించారు. ఇక అలానే మరో బిఆర్ఎస్ నేత ఆకస్మాతుగా మరణించడంతో ఆయనకు ఆర్థిక సహాయం అందించారు కెసిఆర్ అంటూ బాలాజీ తెలిపారు. కెసిఆర్ గారిది డామినేటింగ్ క్యారెక్టర్ అని అయన కోసం పనిచేస్తే వాళ్లను బాగా చూసుకుంటారు, ఆయనను నిందిస్తే వారికి చుక్కలు చూయిస్తారు అంటూ బాలాజీ తెలిపారు.





























