Analyst Damu Balaji : సినిమా రంగంలో డబ్బే ముఖ్యం… సీనియర్ నటి లక్ష్మి హాట్ కామెంట్స్…: అనలిస్ట్ దాము బాలాజీ

0
127

Analyst Damu Balaji : ‘ఓ బేబీ’ సినిమాతో మళ్ళీ హుషారుగా నటించి మెప్పించిన అలనాటి తార లక్ష్మి చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ఒకే భాషకు పరిమితం కాకుండా తమిళ, కన్నడ, హిందీ అంటూ చాలా భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న మహాలక్ష్మి సొంతూరు నెల్లూరు అయితే తండ్రి, తల్లి, అమ్మమ్మ అందరూ సినిమా పరిశ్రమకు చెందిన వారు కావడంతో చెన్నైలో స్థిరపడ్డారు. అలా లక్ష్మి చెన్నైలో జన్మించారు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఎర్రగుడిపాటి లక్ష్మి తండ్రి వైవి రావు దర్శకులు, నటులు. ఇక ఆమె గురించి ఇటీవల ఆమె సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన వాఖ్యల గురించి అనలిస్ట్ బాలాజీ మాట్లాడారు.

డబ్బు కోసమే సినిమాల్లో ఎవరైనా చేస్తారు…

లక్ష్మి సినిమా ప్రయాణం తమిళ సినిమాతో మొదలయింది. ఆ తరువాత తమిళ, తెలుగు, కన్నడ హిందీ లలో నటించింది. హింది లో నటించిన తొలి సినిమా ‘జూలీ’ లో తన నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా తెచ్చుకుంది లక్ష్మి. అలా బాలీవుడ్ లో అవార్డు అందుకున్న తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన లక్ష్మి ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించింది. చాలా సినిమాల్లో తల్లి పాత్రలలో అలాగే విలన్ పాత్రలలో మెప్పించింది. తన లైఫ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ మాత్రం ‘మిథునం’ సినిమా అనే చెప్పాలి. మిథునంలో బాలసుబ్రమణ్యం గారితో ఆమె నటన చాలా బాగుంటుంది, ఇక మళ్ళీ ఓ బేబీ సినిమాల్లో పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయారు లక్ష్మి.

ఇక లక్ష్మి కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పలు సినిమాల్లో నటించింది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో లక్ష్మి మాట్లాడుతూ ఎవరూ సినిమాలలో ఊరికే నటించరు, డబ్బు కోసమే పనిచేస్తారు. కళామతల్లికి సేవ చేయాలనీ నటించాను అంటూ చెప్పే మాటలన్నీ అపద్దమని ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. చిన్నతనం నుండి చాలా ప్రాక్టికల్ గా ఉండే లక్ష్మి గారు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, చూసిన పరిస్థుతుల వల్ల చాలా ప్రాక్టికల్ గా మాట్లాడుతారని బాలాజీ తెలిపారు. ఇప్పటికీ నటిస్తుండటం అదృష్టమంటూ చెప్పే ఆమె రిటైర్ అయితే సొంత పిల్లలకే బరువవుతామని, ఇక ఇండస్ట్రీ మనల్ని గుర్తు పెట్టుకుంటుందా అంటూ మాట్లాడారని బాలాజీ తెలిపారు.