Analyst Damu Balaji : సిబిఐ చేతిలో ఉన్న ఆ రహస్య సాక్షి అతనేనా… వివేకానంద కేసులో జరగబోయేది ఏమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

0
67

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. ఆపైన అవినాష్ రెడ్డికి హై కోర్ట్ బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే వాదనల మధ్యలో సిబిఐ ఒక రహస్య సాక్షి గురించి చెప్పడం, సీల్డ్ కవర్ లో ఆ సాక్షిని ప్రవేశపెడతామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

రంగంలోకి వైఎస్ ప్రతాప్ రెడ్డి…

అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని కేసులో నిందితులుగా నిరూపించడానికి సునీత రెడ్డి, సిబిఐ అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఒక రహస్య సాక్షి ఉన్నాడు అంటూ సిబిఐ కోర్ట్ కి చెప్పడం, సీల్డ్ కవర్ లో సమర్పించడానికి ఒప్పుకోవడంతో అసలు ఆ రహస్యసాక్షి ఎవరు అనే ప్రశ్న మొదలవగా ఆ రహస్య సాక్షి షర్మిల అంటూ మొదట ప్రచారంలో జరిగినా ఇప్పుడు కొత్తగా వినిపిస్తోంది మాత్రం వైఎస్ ప్రతాప్ రెడ్డి పేరు.

వైఎస్ కుటుంబంలో మరో కీలక వ్యక్తి అయిన ప్రతాప్ రెడ్డి గారు స్వయానా అవినాష్ రెడ్డి పెదనాన్న. అయితే ప్రస్తుతం సునీత రెడ్డి వైపు ప్రతాప్ రెడ్డి ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాంటూ బాలాజీ తెలిపారు. వివేకానంద రెడ్డికి అవినాష్, భాస్కర్ రెడ్డికి ఉన్న విబేధాలు సాక్ష్యంగా ప్రతాప్ రెడ్డి చెప్పనున్నట్లు ఆ సాక్ష్యం అవినాష్ కి వ్యతిరేకంగా పనిచేస్తుందని కథనాలు వస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు.