Analyst Damu Balaji : సీఐ అంజు అరాచకాలు… జనసేన కార్యకర్త మీద దొర్జన్యం…: అనలిస్ట్ దాము బాలాజీ

0
149

Analyst Damu Balaji : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా మహిళా అక్రమ రవాణా గురించి మాట్లాడుతూ వాలంటీర్ల నుండి వచ్చే డేటాతో అక్రమ రవాణా జరుగుతోందని కామెంట్స్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ధర్నాలు సాగుతున్నాయి. వారితో పాటు వైసీపీ కార్యకర్తలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించారు. నిరసనలో భాగంగా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మను దహనం చేయగా అందుకు నిరసంగా జనసేన కార్యకర్తలు కూడా ధర్నాలు చేయాలని చూడగా పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. దీంతో కొన్ని చోట్ల లాఠీ చార్జీలు జరిగాయి. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సీఐ అంజు దొర్జన్యం చేసింది…

శ్రీకాళహస్తి సీఐ అంజు తాజాగా ఈ ఇష్యూలో వైరల్ అయిందని అనలిస్ట్ దాము బాలాజీ తెలిపారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు ధర్నా చేయాలనుకోవడం, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో దొంగచాటుగా ధర్నా చేయడం, జగన్ దిష్టి బొమ్మను దగ్ధం చేయాలని చూడగా కాన్స్టేబుల్ ఒక కార్యకర్తను పట్టుకోగా సీఐ అంజు ఆ కార్యకర్త మీద చేయి చేసుకోవడం, ఆ వీడియో వైరల్ అవడంతో ఆమె హాట్ టాపిక్ అయింది.

అంతకుముందు పట్టణంలోని ఒక హోటల్ నిర్వాహకుడి కోసం రాత్రి పూట వెళ్లి అక్కడ అతను కనిపించకపోతే భార్యను స్టేషన్ కి కొట్టుకుంటూ తీసుకెళ్లి బాగా హింసించడం, ఆ వీడియో కూడా అప్పట్లో బాగా వైరల్ అవ్వగా టీడీపీ మహిళా నేత వంగళపూడి అనిత జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయగా వాళ్ళు ఎస్పీ చేత విచారణ చేయించమని చెప్పినా ఎటువంటి ఫలితం కనిపించలేదని బాలాజీ తెలిపారు. ఇంతకు ముందు కూడా టీడీపీ మహిళా కార్యాలర్తను కూడా నిరసన వ్యక్తం చేస్తున్నపుడు ఇలానే చేయి చేసుకుని ఆమె చేయి విరిగిపోతోందని అరిచినా వినిపించుకోలేదు, అప్పట్లో ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది. అలా తాజాగా మరోసారి వర్తల్లోకి నిలిచిన అంజు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి అంటూ బాలాజీ తెలిపారు.