Analyst Damu Balaji : సచివాలయ వాలంటీర్ల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వాఖ్యలకు నిరసనగా వైసీపీ ఆందోళన, వారికి వ్యతిరేకంగా జనసేన ఆందోళనలు తెలిసిందే. అయితే ఆ సమయంలో జనసేన కార్యకర్త మీద చేయి చేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజు యాదవ్ పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. తనకు వార్ణింగ్ ఇచ్చారు. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సీఐ అంజు యాదవ్ సస్పెండ్…
అంజు యాదవ్ గతంలో ఒక మహిళ మీద ఇలాగే దుకుడుగా ప్రవర్తించినా అంజు యాదవ్ మీద తగిన చర్యలైతే తీసుకోలేదు. తాజాగా ఆమె ఒక జనసేన కార్యకర్తను చేయి చేసుకోవడం, వీడియో వైరల్ అవడంతో ఆమె మీద మానవహక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసి ఆమె వివరణ ఇవ్వాల్సిందిగా కోర్ట్ నోటీసులు ఇచ్చింది. తాజాగా అంజు యాదవ్ కు ఛార్జ్ మెమో ఇచ్చారని బాలాజీ తెలిపారు.

ఛార్జ్ మెమో అనగా నీ మీద ఈ ఆరోపణలు వచ్చాయి మేము పాలనా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి వీటికి సమాధానం చెప్పాల్సిందిగా మెమో ఇష్యూ చేస్తారంటూ బాలాజీ తెలిపారు. ఇక ఈ ఇష్యూ లో పవన్ కళ్యాణ్ సీఐ అంతు అక్కడికి వచ్చినపుడు తేలుస్తానంటూ చెప్పడం, బాధిత కార్యకర్తను ఫోన్ ద్వారా పరామర్శించారు అంటూ బాలాజీ తెలిపారు.