Analyst Damu Balaji : మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్. న్యాయస్థానం ముందు అందరూ సమానమే అంటూ మన చట్టం చెబుతుంది. అలాంటి న్యాయస్థానానికి తన కుటుంబం వచ్చి తన కూతుళ్ళకు సుప్రీం కోర్ట్ ను ఆవరణ అలాగే కోర్ట్ లో జరిగే ఆర్గుమెంట్స్ ఎలా ఉంటాయి వంటివి చూపించారు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్. ఈ విషయం ఇపుడు దేశ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. దేశ అతన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తి అయినా ఆయన ఒక తండ్రి కదా అంటూ చర్చించుకుంటున్నారు. ఇక మన సిజేఐ గురించి ఆసక్తికర విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

పోలియో బాధితులైన కూతుర్లతో కోర్ట్ కి సిజేఐ…
యశ్వంత్ ధనంజయ చంద్రచూడ్ గారు 50వ భారత ప్రధాన న్యాయమూర్తి కాగా ఆయన తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ 16వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం కోర్ట్ లో అనేక కీలక కేసులకు తీర్పులను ఇచ్చారు. ఆయన కొడుకు డివై చంద్రచూడ్ వాటిలో కొన్నిటిన్ని తరువాతి కాలంలో మార్పులను చేసారు. కాగా తాజాగా డివై చంద్ర చూడ్ గారు తన భార్య కల్పనా దాస్ కూతుర్లను తీసుకుని సుప్రీం కోర్ట్ చూపించారు అంటూ బాలాజీ తెలిపారు. డివై చంద్రచూడ్ గారికి రెండు వివాహాలు జరిగాయి. మొదటి భార్య రష్మీ 2007లో క్యాన్సర్ తో మరణించగా కల్పనా దాస్ ను పెళ్లి చేసుకున్నారు.

మొదటి భార్య సంతానం అయిన ఇద్దరు అబ్బాయిలలో మొదటి కొడుకు అభినవ్ ముంబై హైకోర్ట్ లో పని చేస్తుండగా చిన్న కొడుకు చింతన్ లండన్ లో బ్రిగ్ కోర్ట్ అఫ్ ఛాంబర్స్ లో పని చేస్తున్నారు. ఇక ఇద్దరు పోలియో బాధిత ఆడపిల్లలను దత్తత తీసుకున్నారు చంద్రచూడ్. 16 సంవత్సరాల మహి, 20 సంవత్సరాల ప్రియాంక లను ఆడపిల్లలు లేరని దత్తత తీసుకున్నారు. వారితో సమయం గడిపే తీరిక లేకపోవడంతో వారికి కోర్ట్ ఎలా ఉంటుంది చూపించాలని చంద్ర చూడ్ గారు సుప్రీం కోర్ట్ కి తీసుకోచ్చారట. తండ్రితో గడపాలని ఏ పిల్లలకైనా ఉంటుంది. అందుకే ఒక తండ్రిగా ఆయన పిల్లకు సమయం కేటాయించాలని ఇలా చేసారు మన దేశ ప్రధాన న్యాయమూర్తి అంటూ బాలాజీ తెలిపారు.