Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి కేసులో పూటకో కొత్త విషయం వెలుగులోకి వస్తూ డైలీ సీరియల్ ను తలపిస్తుండగా జైలులో రిమాండ్ లో ఏ7 గా ఉన్న భాస్కర్ రెడ్డి జైలులో గది మార్చాలని కోర్టుకి పిటిషన్ వేశారు. దీనికి కోర్టు సానుకులాంగా స్పందించి మార్చారు. హాస్పిటల్ లో ఉన్న ఆయనను మళ్ళి జైలుకి తరలించడంతో అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ రెడ్డి గారు తాజాగా బెయిల్ కోసం పిటిషన్ వేశారు. అయితే తాజాగా భాస్కర్ రెడ్డి గారిని ఆయన కొడుకు అవినాష్ రెడ్డి జైలులో కలవడం చర్చనీయాంశం అయింది అంటూ ఇక ఈ ఇష్యూకి సంబంధించిన విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చంచల్ గూడా జైల్లో తండ్రిని పరామర్శించిన అవినాష్…
వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్క్యూస్డ్ 7 గా ఉన్న భాస్కర్ రెడ్డి దాదాపు రెండు నెలలుగా రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు. 70 కి పైగానే వయసున్న ఆయనకు వెన్నెముక ఆపరేషన్ ఫెయిల్ అవడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అలానే వయసు రీత్యా అనారోగ్య సమస్యలు ఉన్నాయి. అందుకే ఆయన సెపరేట్ గది అలాగే పరుపు అన్ని వసతులు అడుగుగా కోర్టు అనుమతించింది. అయితే జైలులో ఉన్న భాస్కర్ రెడ్డిని తాజాగా అవినాష్ రెడ్డి పరామర్శించారు.

అవినాష్ రెడ్డి ఆయన బాగోగులను విచారించి అలాగే తల్లి ఆరోగ్యం గురించి కూడా తెలిపినట్లు బాలాజీ తెలిపారు. ఇక కేసులో ఏం జరగబోతోంది అనే విషయాలు కూడా చర్చించి ఉంటారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. భాస్కర్ రెడ్డి జైలులో ఉంటూనే పైరవీలు చేస్తున్నారని ఆంధ్ర పోలీసుల ప్రమోషన్స్ వంటి విషయాల మీద ఆయన పంచాయితీ చేస్తున్నారని జైలులో ఉంటూనే ఇలాంటివి జరుగుతున్నాయనేది ప్రచారంలో ఉందని బాలాజీ తెలిపారు.

































