Analyst Damu Balaji : నందమూరి తారక రత్న గారు కుప్పం పాదయాత్రలో పాల్గొనడం, ఆయన అక్కడ తీవ్ర గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి ఆపైన బెంగళూరు నారాయణ హృదయాలయలో చికిత్స తీసుకోవడం, 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం అందరినీ కలచివేసింది. ఇక తారకరత్న గారికి భార్య ముగ్గురు పిల్లలు కాగా ఆయనది ప్రేమ వివాహం. పెద్దలను కాదని ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరమయ్యారు. ఇరు కుటుంబాలు తారకరత్న, అలేఖ్య రెడ్దిలను దూరం పెట్టడంతో మొదట్లో ఆర్థికంగా బాగా ఇబ్బందులు పడ్డారు. అలా సాగుతున్న జీవితంలో ఇప్పుడిప్పుడే కొంచం కుటుంబానికి తారకరత్న చేరువవుతున్నాడు అనే సమయంలో ఇలా మృత్యువు దూరం చేసింది. ఇక ఆయన భార్య అలేఖ్య రెడ్డి వారి ప్రేమ గురించి పెళ్లి, పిల్లలు ఎంత ఇబ్బందులను వారు ఎదుర్కొన్నది అన్ని విషయాలను పోస్ట్ పెట్టి అందరినీ ఎమోషనల్ చేసింది. తరచూ వారికి సంబంధించిన విషయాలను పోస్ట్లు పెడుతూ తెలుపుతున్న అలేఖ్య రెడ్డి తాజాగా పిల్లల పేర్ల చివర నందమూరి తొలగించడంతో మళ్ళీ వైరల్ అవుతోంది. ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

నందమూరి కుటుంబం ఇక పట్టించుకోదనే ఈ నిర్ణయం…
అలేఖ్య రెడ్డి ఇప్పటికీ భర్త తారకరత్న మరణాన్ని తట్టుకోలేక పోతున్నారు. అయితే తాజాగా తొలిసారి కూతురు నిశిక ను తీసుకుని ఇషా ఫౌండేషన్ కి వెళ్లిన అలేఖ్య రెడ్డి మిగిలిన ఇద్దరు పిల్లలను విజయ్ సాయి రెడ్డి గారి ఇంట్లో పెట్టి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక కూడా అలేఖ్య రెడ్డిలో బాధ మరింత పెరిగిందే కానీ తగ్గలేదట. ఈ విషయం గురించి మాట్లాడుతూ ప్రదేశాన్ని వదిలి వెళ్లొచ్చు కానీ జ్ఞాపకాలను వదిలి వెళ్లలేము అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. అయితే అలేఖ్య రెడ్డి అక్కడి నుండి వచ్చాక మరింత బాధ పడుతున్నట్లుగా తన లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్లు చూస్తే తెలుస్తుంది అంటూ తెలిపారు బాలాజీ.

అయితే నందమూరి కుటుంబం నుండి ఆమెకు ఏ మాత్రం ఆదరణ లేకపోవడం ఆమెను మరింత బాధకు గురిచేస్తోంది అంటూ తెలిపారు. అందుకే ఆమె ఇంతకు ముందు నందమూరి ఇంటి పేరును పిల్లలకు పేరు చివరన తీసేయడం వారి మీద ఎంత కోపం ఉందో తెలియజేస్తుంది. పిల్లలకు మొదట్లో నిశిక నందమూరి అంటూ పేరు చివరన నందమూరి ఉండేది కానీ ఇప్పుడు నిశిక తారకరత్న అంటూ మార్చేశారు అలేఖ్య రెడ్డి. ఇక అలేఖ్య రెడ్డి పేరును కూడా అలేఖ్య నందమూరి అనే పేరు మార్చుకున్నారు. ఆమె నందమూరి కుటుంబం నుండి ఏమి ఆశించడం లేదు కానీ నందమూరి కుటుంబం వారిని పట్టించుకోకపోవడం లేదు అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.






























