Analyst Damu Balaji : ప్రస్తుతం ఏపీ లో హాట్ టాపిక్ వివేకానంద రెడ్డి హహ్య కేసు. ఈ కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లుగా సిబిఐ భావిస్తూ ఆయనను అరెస్టు చేయాలని కోర్టు అనుమతి అడుగుతున్నా కోర్ట్ లో చుక్కేదురు కావడానికి కారణం అవినాష్ రెడ్డి తరుపున వాదిస్తున్న లాయర్ నిరంజన్ రెడ్డి. ఆయన వాదన ముందు సునీత రెడ్డి తరుపు లాయర్స్ అలాగే సిబిఐ న్యాయవాదులు మౌనంగా ఉండాల్సి వస్తుంది. రేపో మాపో అరెస్టు అన్న పరిస్థితి నుండి తాజాగా 25 వరకు అవినాష్ ను అరెస్టు చేయడానికి వీలు లేదని కోర్ట్ తీర్పు ఇచ్చేదాకా తన పాయింట్స్ తో కోర్ట్ ను కన్విన్స్ చేసారు నిరంజన్ రెడ్డి. అయితే ప్రస్తుతం ఈయన గురించి తెలుసుకోడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక ఆయన గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు. అలాగే ఆయనకు మెగాస్టార్ కు ఉన్న లింకేంటి అని కూడా వివరించారు.

ఆచార్య ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి…
ఇపుడు అందరి చూపులు నిరంజన్ రెడ్డి వైపే. నిరంజన్ రెడ్డి గారిది తెలంగాణ, నిర్మల్ ప్రాంతం. నిరంజన్ ఏపీ సీఎం జగన్ కు సిబిఐ కేసులు వాదించే వ్యక్తిగత న్యాయవాది. ఇక ఈయన సినిమాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆచార్య లాంటి భారీ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన నిరంజన్ అంతకుముందు కూడా క్షణం, ఘాజీ, వైల్డ్ డాగ్, అర్జుణ ఫాల్గుణ వంటి చిత్రాలను ప్రొడ్యూసర్ చేసారు. 2011 నుండి జగన్ అక్రమ ఆస్తుల కేసులో లాయర్ గా వ్యవహరిస్తున్నారు.

1970 జూలై 22 వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నిరంజన్ తన న్యాయవాద విద్యను పూణేలోని సింబయాసిస్ లా కాలేజీలో ఐదేళ్ల కోర్సు చేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీనియర్ న్యాయవాదులైన మనోహర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డిల వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2016లో అప్పటి ఏపీ ఉమ్మడి హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా హోదాను కల్పించింది. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరుపున స్పెషల్ సీనియర్ కౌన్సిల్‌గా సేవలు అందించారు. న్యాయవాదిగా కొనసాగుతూనే సినిమాలపై మక్కువతో నిర్మాతగా మారారు. ఇక ఈయన రాజ్యసభ కు ఏపీ నుండి నామినేట్ అయ్యారు. ఇలా అటు సినిమాల్లోను ఇటు న్యాయవాదిగాను ప్రాముఖ్యం ఉన్న నిరంజన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ ను బయటపడేస్తారనే నమ్మకం తోనే జగన్ ఈ కేసు ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు.





























