Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. అయితే వాదనలు జరిగిన సమయంలో సిబిఐ తరుపు న్యాయవాది వినిపించిన వాదనల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

రహస్య సాక్షి ఉన్నాడు…
వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ తన కస్టడీకి అవినాష్ రెడ్డిని తీసుకోవాలని భావిస్తుండగా ముందస్తు బెయిల్ మీద విచారణ జరిగింది. ఇక అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది ఐదు గంటల పాటు వాదించగా సిబిఐ తరుపు న్యాయవాది అలాగే సునీత రెడ్డి తరుపు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. కోర్ట్ తీర్పును జడ్జి గారు 31వ తేదికి వాయిదా వేయగా సిబిఐ తన వాదనలో పాత పాటే పాడుతూ హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని, అవినాష్ రెడ్డికి అలాగే వివేకానంద రెడ్డి కి పాత గొడవలు ఉన్నాయంటూ వాదించారు.

ఇందులో సాక్ష్యం ఏదైనా ఉన్నదా అని జడ్జి గారు అడిగినపుడు ఒక రహస్య సాక్షి తమకు ఉన్నారని అయితే అతని పేరు సీల్డ్ కవర్ లో అందిస్తామని తెలిపారు. అయితే జడ్జి మాత్రం ఇందుకు అభ్యంతరం తెలిపినట్లు అనలిస్ట్ బాలాజీ తెలిపారు. సీల్డ్ కవర్లో సాక్షి గురించి చెప్పాల్సిన పనేముంది అంటూ ప్రశ్నించారు. ఇంతకుముంది సుప్రీం కోర్ట్ ఏవైనా తీర్పులు ఇచ్చే సమయంలో ఇలా సీల్డ్ కవర్ లో సాక్షి వాంగ్మూలం స్వీకరించినట్లు కేసులు ఏవైనా ఉంటే కోర్ట్ కి సమర్పించవలసిందిగా కోరారు అంటూ బాలాజీ తెలిపారు.





























