Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త కొత్త విషయాలు రోజూ బయటికి వస్తూనే ఉన్నాయి. తాజాగా నిన్న లైవ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివేకాను చంపానని అప్రూవర్ గా మారిన దస్తగిరి మాట్లాడుతూ వివేకా రెండో భార్య షమిమ్ గురించి మాట్లాడటం ఆమె కొడుకు షేహన్షా అసలు వివేకా కొడుకు అండానికి సాక్ష్యాలు లేవు అంటూ మాట్లాడటంతో షమీమ్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ కాపీ అంటూ ఒక రిపోర్ట్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే వివేకానంద రెడ్డి షమీమ్ కొడుకుకి వీలునామాలో ఆస్తులు రాసాడని అయితే వీలునామా మిస్ అయిందంటూ ఏవేవో వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

హత్య కేసు రాజకీయ యుద్ధంగా మారిపోయింది…
బాలాజీ గారు మాట్లాడుతూ వివేకానంద హత్య కేసును రాజకీయంగా వాడుకుంటూ ఎవరికి తోచిన అస్త్రాలు వాళ్ళు వాడుతున్నారు. అలానే ఇప్పుడు వివేకా రెండో భార్య షమీమ్ ను రోడ్డున వేశారు. రేపో మాపో ఆమె వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి, తనకు వివేకానందకు పుట్టిన కొడుకే అని నిరూపించికోవాల్సిన పరిస్థితి. ఇంతవరకు షమీమ్ బయటికి వచ్చి మాట్లాడింది లేదు. కానీ ఆమె స్టేట్మెంట్ అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. డిఎన్ఏ రిపోర్ట్ అంటూ ఏవేవో కథనాలను అల్లుతున్నారు. వీటన్నింటిలో నిజాలు ఎవరికీ తెలియవు. ఆమె వివేకానంద హత్య తరువాత అజ్ఞాతంలో ఉంది, ఎక్కడా ఇంతవరకు కనిపించలేదు.

కావాలనే ఆమెను ఈ కేసులో లాగాలని దస్తగిరి ఇంటర్వ్యూలో ఆమె కొడుకు గురించి అనవసరంగా మాట్లాడాడు. ఇప్పుడు ఆమె వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇదంతా అతని వెనుక ఏదైనా రాజకీయ పార్టీ ఉండి చేయిస్తుందేమో అన్న అనుమానాలకు తావిస్తోంది అంటూ తెలిపారు. ఈ కేసులో సునీత వైపు న్యాయం ఉంది లేక మరో వైపు న్యాయం ఉంది అని చెప్పలేని పరిస్థితి. ఇరువైపులా తప్పులు ఉన్నాయి. హత్య ఎవరు చేసారు అన్నదానికంటే ఆ హత్య చుట్టూ రాజకీయమే అందరికీ కావాలి అన్నట్లుగా మారిపోయింది అంటూ బాలాజీ వ్యాఖ్యణించారు.





























