Analyst Damu Balaji : తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన పదేళ్లకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారం దక్కబోతోంది. ప్రజలు తీర్పుతో కెసిఆర్ ను ఇంటికి పంపించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున సీఎం గా రేవంత్ రెడ్డి అంటూ జరుగుతున్న ఊహగానాల నడుమ కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీరుస్తుందేమో చూడాలి. పదేళ్ళ పాలన మీద ఉన్న ఆత్మ విశ్వాసం తో కెసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే ఓటమి చవిచుడాల్సి వచ్చింది. ఇక బిఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను ఎనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

బిఆర్ఎస్ ఓటమికి కారణాలు అవే….
దాము బాలాజీ తెలంగాణ ఎన్నికల ఫలితల గురించి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలను వివరించారు. గెలిచిన, ఓడిన స్థానాలను బట్టి చూస్తే అర్బన్ ఓటర్లు కెసిఆర్ పాలన ను కోరుకుంటే రూరల్ ఓటర్లు మాత్రం వ్యతిరేకించారని స్పష్టంగా అర్థమవుతోందని చెప్పారు. అభివృద్ధిని చూసి అర్బన్ ఓటర్లు ఓట్లు వేయొచ్చు కానీ పల్లెల్లో మాత్రం ఆలా కాదు అభివృద్ధి కనిపించదు సంక్షేమం కూడా జనాలలోకి వెళ్ళాలి.

అక్కడే బిఆర్ఎస్ పొరపాటు చెసింది. వివిధ పథకాల వల్ల లబ్ది బిఆర్ఎస్ పార్టీ సానుభూతి పరులకే సొంతం కావడం, దళిత బంధు వంటి పథకాలు నిజమైన అభ్యర్థులకు చేరకపోవడం, ఇక కౌలు రైతులకు ఎటువంటి సహకారం అందకపోవడం వల్ల పల్లె ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఉన్న సెటిలర్ ఓట్లు ప్రభావితం చేసాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగరు వంటి చోట్ల చంద్రబాబు ప్రభావం కనిపించింది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.





























