Analyst Damu balaji : మెగా డాటర్ నిహారిక కొణిదెల ఆమె భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలియగానే సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అసలు ఎవరిది తప్పు, నిహారిక పబ్ లో దొరకడం వల్లే ఇదంతా జరిగింది అంటూ ఎవరికి వారు కథనాలను అల్లేసుకుంటున్నారు. ఇద్దరిలో తప్పెవరిది అంటూ ఆరాలు తీస్తున్నారు. ఎక్కువ శాతం సాధారణ ప్రజలు నిహారిక చైతన్య విషయంలో నిహారికదే తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇక తాజాగా చైతన్య తండ్రి చెప్పినట్లుగా కొన్ని మాటలు మీడియాలో కనిపిస్తున్నాయి. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

నిహారిక మాకు గౌరవం ఇవ్వలేదు…
నిహారిక చైతన్య 2020 డిసెంబర్ లో పెళ్లి చేసుకోగా తాజాగా కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఇద్దరిలో తప్పు నిహారిక వైపే ఎక్కువగా కనిపిస్తోందని చాలా మంది అనుకుంటున్నట్లు బాలాజీ తెలిపారు. నిహారిక ఒక డాన్స్ మాస్టర్ తో చేస్తున్న వీడియో, అలాగే జిమ్ ట్రైనర్ మీద కూర్చొని ఉన్న వీడియో, ఇక పబ్ లో ఉగాది రోజు దొరకడం వంటి విషయాలు చైతన్య కుటుంబానికి నచ్చకపోయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా చైతన్య తండ్రి ప్రభాకర్ గారు సన్నిహితులతో మాట్లాడుతూ నిహారిక రాత్రి పబ్బులలో పగలు మేకప్పులు వేసుకుని తిరగడం తప్ప మావాడితో అసలు ఉండేది కాదు. మాకు ఏనాడూ గౌరవం ఇవ్వలేదు అంటూ చెప్పారనే వార్త బాగా వినిపిస్తోంది. అయితే ఇందులో నిజానిజాలు తెలియక పోయినా జనాలు ఈ మాటలను నమ్మేస్తున్నారని బాలాజీ తెలిపారు.



























