Analyst Damu Balaji : సినిమా ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా మొదలయి దాదాపు 1500 సినిమాలకు డాన్స్ కంపోజ్ చేసిన రాకేష్ మాస్టర్ అసలు పేరు రామారావు. ప్రస్తుతం టాప్ డాన్స్ మాస్టర్లు గా ఉన్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లు ఈయనకు శిష్యులు. చిరునవ్వుతో, లాహిరి లాహిరి లాహిరిలో, దేవదాసు, సీతయ్య వంటి సినిమాలకు కోరియోగ్రఫీ చేసిన రాకేష్ మాస్టర్ ఢీ షో ద్వారా మరింత క్రజ్ తెచ్చుకున్నాడు. బషీర్ అనే కంటెస్టెంట్ కి ఢీ షోలో డాన్స్ మాస్టర్ గా ఉండేవాడు. ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ వీడియోల ద్వారా ఫేమస్ అయ్యాడు. ఇక జబర్దస్త్ లో అడపాదడపా కనిపించేవాడు. అయితే తాజాగా వైజాగ్ నుండి షూటింగ్ కోసం వెళ్లి హైదరాబాద్ తిరిగిగివచ్చిన రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ ఆదివారం నాడు కన్నుమూశారు. ఇక ఆయన జీవితం గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

చావుకు కారణాలు ఏంటంటే…
దాము బాలాజీ మాట్లాడుతూ రాకేష్ మాస్టర్ డాన్స్ మాస్టర్ గా కష్టపడి ఏదిగి ఎంతో మంది శిష్యులను తయారుచేసాడు. కానీ ఆయన సక్సెస్ కాలేకపోయాడు అంటూ చెప్పారు. సినిమాల్లో కోరియోగ్రఫీ చేస్తూనే డాన్స్ క్లాసెస్ చెప్తూ వచ్చిన రాకేష్ మాస్టర్ తన కోపం ముక్కుసూటి తనం వల్లే శత్రువులను పెంచుకున్నాడు అంటూ చెప్పారు.

ఎంతో గొప్ప డాన్సర్ అయినా తన అలవాట్ల వల్లే ఆయన మరణించారని ఆయన జీవితం చాలా మందికి గుణపాఠం అంటూ చెప్పారు. ఆయన కరోనా సమయం నుండి కుటుంబానికి దూరంగా మద్యానికి బానిసగా మారి దిగజారిపోయారు. యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూ వీడియోలను చేస్తూ అందరినీ విమర్శిస్తూ మరింత దిగజారిపోయారు అంటూ చెప్పారు బాలాజీ. ఎంతో దానగుణం ఉన్న వ్యక్తి రాకేష్ మాస్టర్ కానీ తన తాగుడు వల్లే అనారోగ్యంతో చనిపోయారు అంటూ బాలాజీ తెలిపారు.



























