Analyst Damu Balaji : తెలుగులో ‘దేవి’ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి వనిత విజయ్ కుమార్. సీనియర్ హీరోయిన్ మంజుల కూతురిగా ఇండస్ట్రీలోకి అడుపెట్టిన వనిత హీరోయిన్ గా పలు తమిళ, తెలుగు, మలయాళం సినిమాలలో నటించింది. ఈమె సినిమాల్లో తెచ్చుకున్న పేరు కంటే ఆమె వ్యక్తిగత జీవితం వల్లే ఎక్కువగా పాపులర్ అయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెళ్లిళ్లు ఒక లివింగ్ రిలేషన్ షిప్ ద్వారా ఫేమస్ అయింది వనిత. ఆమె తండ్రి విజయ్ కుమార్, చెల్లెలు ప్రీతి, శ్రీదేవి అందరూ ఆమెను దూరం పెట్టేసారు. ఇక బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలో పాల్గొన్న ఆమె వివాదాలతో అక్కడ ఫేమస్ అయింది. అయితే ప్రస్తుతం ఆమె మూడో భర్త మరణంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

గుండెపోటుతో పీటర్ మృతి…
అనలిస్ట్ దాము బాలాజీ వనిత విజయకుమార్ గురించి మాట్లాడుతూ ఆమె రిలేషన్స్ వల్లే ఆమె బాగా వైరల్ అయిందని అందుకే ఇటీవల నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి సినిమాలో రమ్య రఘుపతి క్యారెక్టర్ ను కూడా వనితతో చేయించారు అంటూ తెలిపారు బాలాజీ. ఆమె 2000 సంవత్సరంలో అకాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వారికి ఇద్దరు పిల్లలు అయితే 2007లో విడాకులు తీసుకుని మళ్ళీ 2007లో ఆనంద్ జయరాజన్ ను పెళ్లి చేసుకున్నారు.

మళ్ళీ పెళ్లయ్యాక 2012 లో విడాకులు తీసుకుని రాబర్ట్ అనే వ్యక్తి తో లివింగ్ రిలేషన్ లో ఉన్నారు వనిత. 2017 వరకు రాబర్ట్ తో సహజీవనం చేసిన ఆమె 2017 లో విజువల్స్ డైరెక్టర్ గా పని చేస్తున్న పీటర్ పాల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పీటర్ పాల్ తో పెళ్లి వివాదం కూడా అయింది. అయితే అదే ఏడాది అతను బాగా తాగుతాడని తనకు వేదిస్తున్నాడనే కారణాలతో అతనితో విడిపోయారు వనిత విజయ్ కుమార్. తాజాగా ఎక్కువగా మధ్య సేవించడం వల్ల ఆరోగ్యం క్షిణించి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పీటర్ పాల్ మరణించారు అంటూ బాలాజీ తెలిపారు.

































