Analyst Damu Balaji : తెలంగాణ ఏర్పడ్డాక మొదట్లో సినిమా ఇండస్ట్రీ గురించి ఆందోళనలో ఉండేవారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆంధ్ర వాళ్ళను హైదరాబాద్ నుండి పంపించేస్తారు అనేటువంటి వదంతులు వినిపించేవి. కానీ తెలంగాణ ప్రభుత్వం అలాంటి చర్యలు ఏమీ చేయలేదు, ఇండస్ట్రీ తెలంగాణ నుండి ఆంధ్రకు తరలి రాలేదు. ఇక ఆంధ్రలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలని ఆంధ్ర ప్రభుత్వం కూడా ఇండస్ట్రీ పెద్దలతో పలు మార్లు చర్చించారు. అయితే ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ఇక ప్రస్తుతం జగన్ ప్రభుత్వం మాత్రం ఇండస్ట్రీని ఆంధ్రలో కూడా పనిచేయాలని రాయితీలు ఇస్తామంటూ ప్రకటిస్తున్నారు. ఇక ఈ విషయం మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

వైజాగ్ కి సినిమా ఇండస్ట్రీ…
ఆంధ్ర లోని పలు ప్రాంతాలు సినిమా షూటింగ్స్ కి అనుకూలంగా ఉంటాయి. అందులోనూ సముద్ర తీరం ఉండటం అరకు వ్యాలీ వంటివి ప్రత్యేక ఆకర్షణలు ఇప్పటికే తెలుగే కాకుండా పలు ఇతర భాషల సినిమాలు కూడా ఆంధ్రలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందుకే ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వడం కోసం సినిమాలు ఏపీలో షూటింగ్ చేసుకుంటే పన్నుల్లో రాయితీలు అలాగే విడుదల సమయంలో బెనిఫిట్స్ వంటివి ప్రకటిస్తున్నారు.

అదీ కాక ప్రస్తుతం ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్న పోసాని ద్వారా ప్రభుత్వంతో మాట్లాడితే మరిన్ని ప్రయోజనాలు షూటింగ్స్ ఇచ్చే ఆస్కారం ఉందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. ఆస్కార్ అవార్డు గ్రహీతలకు జరిగిన సన్మానంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి వైజాగ్ కి ఇండస్ట్రీ రావాలని జగన్ ప్రభుత్వం పలు రాయతీలను ఇస్తున్నట్లు చెప్పి అక్కడ స్టూడియోలను నిర్మించాలని, ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని సూచించారు అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.






























