Analyst Damu Balaji : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శ్వేత ఆత్మహత్య కేసులో ఆమె భర్త మణికంఠ, అత్తమామలు పుష్పలత, శాంతా రావు, అలాగే ఆడపడుచు భర్త సత్యం లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. సీపీ త్రివిక్రమ్ రావు చెప్పినట్లుగా ఈ కేసులో శ్వేత మరణానికి తగిన న్యాయం జరుగుతుందో లేదో వేచిచుడాలి. అయితే జైలులో ఉన్నా శ్వేత అత్తింటి వారి ప్రవర్తణ మారలేదు, వాళ్లలో కనిపించడం లేదు అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు.

జైలులోనూ సింపతీ కార్డు వాడుతున్న శ్వేత అత్తింటి వాళ్ళు…
వైజాగ్ జైలులో ఉన్న శ్వేత భర్త మణికంఠ, మామ, ఆడపడుచు భర్త ముగ్గురూ వేర్వేరు చోట్ల ఉంటే అక్కడ లంచం ఇచ్చో లేక ఏదో లాగా మేనేజ్ చేసి ఒకే గదిలో ముగ్గురూ ఉండేలాగా చేసుకున్నారంటూ బాలాజీ తెలిపారు. ఇక శ్వేత అత్త పుష్పలత ను మహిళా జైలులో వేయగా వయసు మీద పడిన మహిళ చేయని తప్పుకి జైలుకి వచ్చినట్లుగా అక్కడి వారిని నమ్మించింది, సానుభూతి పొందుతోంది అంటూ తెలిపారు. వైజాగ్ జైలులో ఎక్కువగా గంజాయి కేసుల్లో పట్టుబడే వారు ఎక్కువగా ఉంటారు.

అలాంటి వాళ్ళు శాంతా రావు వాళ్ళకి కొంత పరిచయం ఉండటం జైల్లో వారికి కలిసివచ్చింది. చదువుకుని సాఫ్ట్వేర్ గా పనిచేస్తున్న మణికంఠ అలాగే మిగిలిన ఇద్దరూ కూడా చదువుకున్న వాళ్ళు కావడం, చేయని తప్పుకి జైలుకి వచ్చాము అని సానుభూతి కార్డు వాడడం వల్ల జైలులో బాగానే ఉన్నారు. కొంచం మీడియా అటెన్షన్ తగ్గాక బెయిల్ వస్తుంది వాళ్ళకి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.































