Analyst Damu Balaji : సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినాటు వాళ్ళు ఎవరి గురించైనా మాట్లాడొచ్చు అనేట్లుగా తయారైంది. తొందరగా జనాల్లోకి వెళ్లాలంటే ఖచ్చితంగా ఎవరో ఒక సెలబ్రిటీ గురించి ఏదో ఒక హాట్ కామెంట్స్ చేస్తే చాలు వ్యూస్, లైక్స్ మాత్రమే కాకుండా పాపులర్ కూడా అయిపోతారు. అలానే తాజాగా హీరోయిన్ సమంత గురించి టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కి బ్రాండు అంబాసిడర్ లాగా ఫీల్ అయ్యే శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలను చేసింది. సమంత ను బాడీ షేమింగ్ చేస్తూ శ్రీరెడ్డి చేసిన వాఖ్యల మీద అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సమంతను వారితో పోలుస్తూ…
శ్రీరెడ్డి ఈ మధ్యలో యూట్యూబ్ ఛానెల్ పెట్టి మరీ ఏపీ రాజకీయాల గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఉంటుంది. దాము బాలాజీ ఆమె గురించి మాట్లాడుతూ ఆమె యూట్యూబ్ ఛానెల్ వ్యూస్ కోసం సంపాదన కోసం ఈజీ టార్గెట్ అయిన సెలబ్రిటీలను కామెంట్స్ చేస్తూ హైప్ తెచ్చుకుంటుంది. ఇక ఆమె లాంగ్ టర్మ్ గోల్ రాజకీయాల్లో ఉండాలని అందుకే అలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూనే మరో వైపు బీజేపీ వైపు చూస్తోంది అంటూ దాము బాలాజీ అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా సమంత గురించి శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ సమంత తాజాగా అమెజాన్ కోసం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుండగా, సిటాడెల్ అనే హాలీవుడ్ వెబ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా ఇండియా వెర్షన్ లో సమంత వరుణ్ ధావన్ నటిస్తున్నారని తెలిపారు బాలాజీ.

అయితే ఆ వెబ్ సిరీస్ కోసం సమంత బాగా ఎక్సపోసింగ్ ఇవ్వనున్నట్లు ఇప్పటికే లీక్ అయిందని ఆ విషయం గురించి శ్రీ రెడ్డి మాట్లాడుతూ సమంత తన బాడి మొత్తం చూపించినా అక్కడ ఏమి ఉండదు, జబర్దస్త్ లో శాంతి స్వరూప్, అలాగే వినోదిని కంటే అందంగా ఏమి ఉండదు, వాళ్ళే సమంతా కంటే బాగుంటారు అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఈ మ్యాటర్ గురించి దాము బాలాజీ గారు మాట్లాడుతూ సమంత ఎలాగూ శ్రీరెడ్డి మాటలని పట్టించుకోదు అలాగే ఈ ఇష్యూ మీద కేసు పెట్టదు కాబట్టి తన హైప్ కోసం శ్రీ రెడ్డి ఇలా క్రేజ్ బాగా ఉన్న సమంత మీద పడింది అంటూ చెప్పారు.



























