Analyst Dasari Vignan : సినిమా ఇండస్ట్రీలో మరోసారి వివాదం చెలరేగింది. ఈసారి నేరుగా దిల్ రాజు మీద కాకపోయినా పరోక్షంగా ఈ ఇష్యూలో కూడా దిల్ రాజు ఉన్నాడు. అల్లు అరవింద్ ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ డైరెక్టర్ పరుశురాం మీద ఉన్న కోపాన్ని ప్రదర్శించాలని అనుకున్నారు. అయితే ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ మరో వివదానికి తెరలేపడం ఎందుకు అని అలోచించి విరామించుకున్నారు. అయితే అసలు పరుశురాం కి అల్లు అరవింద్ కి మధ్య గొడవ ఏమిటి, అందులో దిల్ రాజు ఎలా వచ్చారు అనే విషయాలను దాసరి విజ్ఞాన్ విశ్లేషించారు.

ఒకే స్క్రిప్ట్ ఇద్దరికి… అందరి దగ్గర అడ్వాన్సలు…
డైరెక్టర్ పరుశురాం కి మొదట ఛాన్స్ ఇచ్చి సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ను చేసింది అల్లు అరవింద్ అనే చెప్పాలి. ఆయన నిర్మాణం సంస్థ గీతా ఆర్ట్స్ ద్వారా ‘గీత గోవిందం’ సినిమాను తీసారు. ఆ సినిమా ఓ మోస్తరుగా సక్సెస్ అవుతుంది అనుకుంటే సూపర్ హిట్ అయి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమాకు మంచి లాభాలు రావడంతో అందులో నుండే కొంత డబ్బు పరుశురాం కి అడ్వాన్స్ గా ఇచ్చి మరో సినిమా ప్లాన్ చేసాడు అల్లు అరవింద్. అది కూడా విజయ్ దేవరకొండ తోనే. అయితే స్క్రిప్ట్ రెడీ చేస్తున్న సమయంలో మార్పులు చేర్పులు చేయడంతో టైం తీసుకున్నాడు పరుశురాం, ఈ గ్యాప్ లో మహేష్ ‘సర్కారు వారి పాట’ వచ్చి వెళ్ళింది. ఇక మళ్ళీ విజయ్ దేవరకొండ తో సినిమా గురించి వచ్చేసరికి దిల్ రాజు కంట స్క్రిప్ట్ పడింది. అల్లు అరవింద్ డెవలప్ చేయమన్న స్క్రిప్ట్ దిల్ రాజు కి నచ్చి సినిమా చేద్దామని చెప్పాడు.

సినిమా కోసం 50 కోట్లు బడ్జెట్ అనుకున్న అల్లు అరవింద్ కి షాక్ ఇస్తూ దిల్ రాజు 100 కోట్లలో చేద్దాం పార్టనర్ గా చేద్దాం అని పరుశురాం ద్వారా అల్లు అరవింద్ కి రాయబారం పంపగా తానొక్కడినే 50 కోట్లు పెట్టి రిస్క్ చేసి సినిమా చేయాల్సిన అవసరం లేదని, ఆ స్క్రిప్ట్ తనకు చెప్పి అడ్వాన్స్ ఇప్పించుకుని ఇప్పుడు దిల్ రాజుతో ఎలా సినిమా చేస్తాడని అల్లు అరవింద్ కోపం తెచ్చుకున్నారు. ఇదే సమయంలో ఈ విషయం తెలుసుకున్న మరో నిర్మాత భోగవిల్లి ప్రసాద్ గారు అరవింద్ ను కలిసి తన వద్ద పరుశురాం అడ్వాన్స్ తీసుకున్న సంగతి చెప్పారు. అలా పెద్ధ నిర్మాతలతో అడ్వాన్స్ లు తీసుకుని చివరకు దిల్ రాజుతో సినిమా చేయాలని అనుకోవడం పట్ల కోపంతో ప్రెస్ మీట్ పెట్టి విషయం తేల్చుకోవాలని అరవింద్ భావించారు. అయితే మధ్యలో కొంతమంది నిర్మాతల ద్వారా దిల్ రాజు ఆ ప్రెస్ మీట్ ను ఆపించి మనలో మనం చర్చించుకుని పరిష్కరించుకుందామని చెప్పాడు అంటూ విజ్ఞాన్ వివరించారు.































