Anasuya Bharadwaj : ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద ప్రసారమవుతున్న ప్రోగ్రాములలో జబర్దస్త్ కు చాలా ప్రత్యేకత వుంది. షో మొదలు అయిన రోజు నుండి ఈరోజు వరకూ టాప్ రేటెడ్ ప్రోగ్రాములలో ఒకటిగా కొనసాగుతోంది. అంతేకాకుండా చాలా మంది నటీనటులను పరిచయం చేసింది. అయితే ఈ మధ్య జబర్దస్త్ ను కొన్ని కారణాల వలన చాలా మంది విడిచి వెల్లిపోతున్నారు. ఈకోవలోనే జబర్దస్త్ ద్వారా యాంకర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న అనసూయ కూడా వదిలి వెళ్ళిపోతోంది. దీని గురించి అనసూయ ఇంతకుముందే చెప్పినప్పటికీ, జబర్దస్త్ టీమ్ లేటెస్ట్ ఎపిసోడులో కంఫర్మ్ చేసింది. దీనికి సంబందించిన ప్రోమో ఇపుడు వైరల్ అవుతోంది.

నెలలో మూడు రోజులు కేటాయించలేవా…
తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ జబర్దస్త్ ను విడిచి వెళ్లిపోయిన విషయాన్ని షో నిర్వాహకులు కంఫర్మ్ చేశారు. చలాకీ చంటి అయితే తన స్కిట్ లో అనసూయకు ఇదే లాస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ కూడా చేశాడు. తాగుబోతు రమేశ్ ఏకంగా అనసూయ గెటప్ వేసి స్కిట్ చేశాడు. అనసూయ గెటప్ వేసిన తాగుబోతు రమేశ్ చంటి పిల్లలు ఉన్న సమయంలో కూడా, అనసూయ జబర్దస్త్ కోసం ఎలా కష్టపడిందో చెబూతు అందరి చేత కన్నీళ్లు పెట్టించాడు.

నెలకు మూడు రోజులు జబర్దస్త్ షో కోసం కేటాయించలేవా అని చంటి నిలదీసాడు. ఇక జడ్జి గా వ్యవహారిస్తున్న ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు. ఖచ్చితంగా ఈ షో మిమ్మల్ని మిస్ అవుతుంది అంటూ అనసూయను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. “ఎంతో మందికి ఈ షో జీవితాన్ని ఇచ్చింది, ఇకపై కూడా ఇస్తూనే ఉంటుంది. ఈ షోకి ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అయితే జబర్దస్త్ మాత్రం పర్మినెంట్” అంటూ కంటెస్టెంట్లు అందరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ షో కి సంబందించిన ప్రోమో వైరల్ అవుతోంది.































