Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూ అనసూయ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇలా యాంకర్ గా వచ్చిన గుర్తింపుతో సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకొని నటిగా మంచి గుర్తింపు పొందింది. బుల్లితెర మీద ప్రసారమైన టీవీ షోలో ఎంతో హాట్ గా కనిపించే అనసూయ సినిమాలలో మాత్రం వైవిధ్యమైన పాత్రలలో నటిస్తూ డి గ్లామర్ పాత్రలో ఎక్కువగా నటిస్తోంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అనసూయ తరచూ తన గ్లామర్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ ఉంటుంది. అంతే కాకుండా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచు వార్తల్లో నిలుస్తుంది. సోషల్ మీడియాలో అనసూయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా అనసూయ వేసుకొని పొట్టి బట్టలకు సోషల్ మీడియాలో అనేక విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయినప్పటికీ ఈ అమ్మడు తగ్గేదేలే అన్నట్లు తనను విమర్శించిన వారి మీద ఫైర్ అవుతూ ఉంటుంది. ఇక ఇటీవల పెళ్ళి రోజు సందర్భంగా భర్త తో కలిసి సముద్రం ఒడ్డున బికినీ ధరించి అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Anasuya: పొడవు దుస్తులు వేసుకోమని చెబుతాడు..
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ తాను ధరించే బట్టల గురించి తన పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో తెలిపింది. ఈ క్రమంలో అనసూయ మాట్లాడుతూ ‘ తాను ఎప్పుడైనా షాట్స్, మినీస్ లేదా బొడ్డు కనిపించే విధంగా బట్టలు ధరిస్తే తన పెద్ద కొడుకు ఎందుకు మమ్మీ ఇలా బట్టలు వేసుకుంటున్నావ్..కాస్త పెద్దవి వేసుకో అని మొహం మీద చెబుతున్నాడని తెలిపింది. అయితే తాను మాత్రం.. నా బట్టలు నా ఇష్టం. బట్టలు వేసుకోవడంలో నాకు స్వేచ్ఛ కావాలి అంటూ బట్టల విషయంలో మహిళలకు స్వేచ్ఛ ఉండాలని ఇప్పటినుండే తన పిల్లలకు పాఠాలు చెబుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఎప్పటిలాగే నెటిజెన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.





























