Anasuya: యాంకర్ అనసూయ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె చేసినటువంటి పొలిటికల్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈమె మంచి లీడర్ కి సపోర్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ కనుక పిలిస్తే జనసేన పార్టీకి తాను సపోర్ట్ చేస్తాను అంటూ వెల్లడించారు. ఇక నాగబాబు పవన్ కళ్యాణ్ పిలిస్తే అదే పార్టీకి మద్దతు తెలుపుతానని ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఇలా జనసేనకు ప్రచారం చేస్తానని ఈమె చెప్పడంతో జనసేన నాయకులు ఈ వార్తలను మరింత వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా మరి కొంతమంది అనసూయ సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనసూయ అక్కడ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ మీడియా సమావేశంలో భాగంగా అనసూయను రిపోర్టర్స్ ప్రశ్నిస్తూ జనసేనకు ప్రచారం చేస్తున్నారట ఇందులో ఎంతవరకు నిజం ఉంది అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ ఈ మధ్యకాలంలో నేను దగ్గినా తుమ్మినా కూడా నన్ను ట్రోల్ చేస్తున్నారని ఈమె తెలిపారు. నేను జనసేనకు ప్రచారం చేస్తానని ఎక్కడా కూడా చెప్పలేదు మంచి లీడర్స్ అడిగితే సపోర్ట్ చేస్తానే కానీ నా అంతట నేను వెళ్లి సపోర్ట్ చేస్తానని ఎక్కడ చెప్పలేదు.
జనసేన ప్రచారం చేస్తానని చెప్పలేదు..
పవన్ కళ్యాణ్ అని మాత్రమే కాదు ప్రతి పార్టీలో కూడా చాలామంది మంచి అజెండాలతో కలిగినటువంటి వారు ఉన్నారు. అలాంటి లీడర్స్ అడిగితే కనుక నేను పార్టీలను చూడకుండా వ్యక్తులను చూసి సపోర్ట్ చేస్తానని చెప్పానే తప్ప ఎక్కడ కూడా జనసేనకు ప్రచారం చేస్తానని చెప్పలేదు అంటూ ఈ సందర్భంగా అనసూయ తన గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తిరుమలలో వైద్య సేవ చేయాలనుకునే వారికి మంచి అవకాశం అందుబాటులోకి వచ్చింది. Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న…
అమ్మాయిల్లో చాలామందికి జుట్టు సరిగ్గా పెరగడం లేదనే ఆందోళన ఉంటుంది. పల్చగా, బలహీనంగా మారిన జుట్టు వల్ల చాలా మంది…
గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకుని బయటకు వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ మెట్ల దగ్గర వదిలిన చెప్పులు కనిపించకపోతే…
దేశంలో కుంభమేళా అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్. అక్కడ జరిగే మహాకుంభమే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. కానీ…
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…