Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈమె లైగర్ సినిమాని ఉద్దేశిస్తూ చేసిన పరోక్ష ట్వీట్ ఇందుకు కారణం అని తెలుస్తుంది.ఈమె కర్మ సిద్ధాంత ఫలితం ఇప్పుడు కాకపోయినా మరి కాస్త ఆలస్యంగా అయినా రావచ్చు రావడం మాత్రం పక్కా అంటూ చేసిన ట్వీట్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారని అభిమానులు రెచ్చిపోయారు.
ఈ విధంగా అనసూయ ఒక్క ట్వీట్ చేయడంతో నేటిజెన్లు ఈమెపై పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తూ తనని దారుణంగా ట్రోల్ చేశారు. కొందరు తనని ఏజ్ బాడీ షేమింగ్ చేస్తూ తనని ఆంటీ అంటూ ట్రోల్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన అనసూయ గట్టిగా తనని విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ తనపై ఇలాంటి విమర్శలకు పాల్పడిన వారి మీద పోలీసు కేసు కూడా పెట్టారు.
నా ఆత్మగౌరవం కాపాడుకోవటం కోసం తాను ఎక్కడి వరకు అయినా వెళ్తానని,తనని విమర్శించిన వారికి సంబంధించిన ప్రతి ఒక్క స్క్రీన్ షాట్ నా దగ్గర ఉందని ఆధారాలతో సహా వాటిని బయటపెట్టి తప్పకుండా చర్యలు తీసుకొనేలా చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.అలాగే నా కెరియర్ ను దెబ్బ కొట్టాలని కొందరు చూస్తున్నారని అలాంటి వారిని కూడా అసలు వదిలిపెట్టనంటూ ఈ సందర్భంగా అనసూయ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అయితే అనసూయ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొందరు ఉద్దేశపూర్వకంగానే తన ఎదుగుదలను ఓర్వలేక ఇలా చేస్తున్నారా ఈమె వెనక ఇంత కుట్ర జరుగుతుందా అంటూ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి అనసూయ తనని విమర్శించిన వారిపై చర్యలు తీసుకునే వరకు తన పంతం వదులుకోదని తెలుస్తోంది. మరి ఈ వివాదంలో ఎవరు నెగ్గుతారో లేచి చూడాలి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…