తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.పలు కార్యక్రమాలకు యాంకర్ గా విధులు నిర్వహిస్తున్న ఈమె ఎనలేని ప్రేక్షకాదరణ పొందిందని చెప్పవచ్చు. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు. కెరియర్ మొదట్లో పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలు ద్వారా సందడి చేసిన రష్మి ఆ తర్వాత బుల్లితెరకు అంకితమైంది.
ఇక బుల్లితెరపై సుడిగాలి సుధీర్,రష్మీ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ద్వారా నిర్వాహకులు పలు కార్యక్రమాలలో సందడి చేయడానికి వీరికి అవకాశం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ప్రయాణం సాగుతోందని పలు పుకార్లు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం అపోహ మాత్రమేనని ఖండించారు. బుల్లితెరపై కేవలం జబర్దస్త్ కార్యక్రమంలో మాత్రమే కాకుండా “ఢీ” షోలో కూడా ఈ జంట తెగ సందడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ‘ఢీ 13.. కింగ్స్ వర్సెస్ క్వీన్స్’ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమో లో భాగంగా కంటెస్టెంట్ లు, కొరియోగ్రాఫర్లు కలిసి డాన్స్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొరియోగ్రాఫర్ చైతన్య చిన్న పిల్లాడి వేషధారణలో ఎంతో అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారు. ఈ విధంగా చైతన్య డాన్స్ పర్ఫార్మెన్స్ కు అక్కడ ఉన్నవారు ఫిదా అయ్యారు.
ఈ క్రమంలోనే చైతన్య డాన్స్ పై రష్మీ స్పందిస్తూ..”హీరోలు ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్న వారి ఫోటోలు ఎప్పుడు గోడకు మాత్రమే ఉంటాయి.. కానీ టెడ్డీబేర్ ఎప్పుడు బెడ్ మీదే ఉంటుందంటూ” కొరియోగ్రాఫర్ చైతన్య పై హాట్ కామెంట్ చేశారు. రష్మి ఇలా కామెంట్ చేయడంతో చైతన్య మాస్టర్ తెగ సంబరపడిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…