బిగ్‌బాస్ తెలుగు రియాల్టీ సో మొదలై దాదాపు 3 నెలలు దాటి పోయింది. మొదట 19 మందితో మొదలైన ప్రయాణంలో ఐదుగురు మాత్రమే మిగిలారు. వీళ్ల గురి ఇప్పుడు టైటిల్ మీదే ఉంది. వీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి అటు ప్రేక్షకులు మాత్రమే కాదు, ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు కూడా సాయం చేస్తున్నారు.

తమకు ఇష్టమైన కంటెస్టెంట్ గెలవాలని ఎవరి ప్రయత్నం వాళ్లు చేసేస్తున్నారు. వివిధ ప్లాట్ ఫామ్ లలో తమ మద్ధతును ప్రకటిస్తున్నారు. ఫైనలిస్టుల్లో ఒకరికి ఓట్లేయమంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక తాజాగా యాంకర్ రవి కూడా తన ప్రచారం మొదలు పెట్టేశాడు.
ఇక హౌజ్ లో ఉన్న వాళ్లతో ఎక్కువగా రిలేషన్ పెంచుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే.. అది శ్రీరామచంద్రతోనే. శ్రీరామచంద్ర గెలుపు కోసం రవి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం హౌజ్ లో ఉన్న ఐదుగురుకి టైటిల్ గెలిచే అర్హత ఉందంటూనే.. ఫైనల్ గా శ్రీరామ్ కే టైటిల్ దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు యాంకర్ రవి. అందరిలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో తన ప్రచారం మొదలు పెట్టాడు.
ఆటో దగ్గర నిలబడి.. బిగ్‌బాస్ హౌస్, అన్నపూర్ణ స్టూడియో అంటూ అరుస్తూ.. ప్రయాణికులను పిలిచే ప్రయత్నం చేశాడు. ఒక వ్యక్తి వచ్చి.. అన్న అంత తొందరగా బయటకు వచ్చావ్ ఏంటి అన్నా అని అడగ్గానే.. అలా బయటకు వచ్చాను కానుక ప్రజల మనస్సులను గెలిచాను అది చాలు అంటూ చెబుతూ.. ఆటోవాలాగా మారిపోయాడు రవి. ‘బిగ్‌బాస్ సీజన్ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి’ అంటూ ఆటో నడిపాడు. ఇక ఆటో అలా ముందుకు వెళ్తుండగా.. ఆటో వెనకాల ఓట్ ఫర్ శ్రీరామ చంద్ర అంటూ పోస్టర్ కనిపించింది. ఇలా రవి శ్రీరామ చంద్రకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు.































