యాంకర్ రవి ప్రతీ ఒక్కరికీ తెలిసిన పేరు. తన అల్లరితో పంచ్ డైలాగ్స్ తో అతితక్కువ సమయంలోనే యూత్ కి దగ్గరయిన యాంకర్ రవి.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 5 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొని.. 12 వ వారంలో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో బిజీగా మారాడు యాంకర్ రవి.

తాజాగా అతడి ఇంటర్వ్యూ పాల్గొన్న రవి తనతో ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ఒక స్నేహితుడు తనని దారుణంగా మోసం చేశాడని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు. అతడిని నమ్మి 20 రోజుల్లో తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడంతో డాక్యుమెంటేషన్ లేకుండా రూ.45 లక్షలు ఇచ్చానని రవి చెప్పాడు.

అన్న బిజినెస్ పెట్టుకోవాలి.. డబ్బులు కావాలి అని అడిగితే ఇచ్చానని.. రూ.45 లక్షలు తీసుకొని ఇప్పటికే రెండు ఏళ్ళు అయిన ఇప్పటికి కూడా కనీసం ఆచూకీ కూడా లేదని యాంకర్ రవి తెలిపారు. దీనికోసం తన తండ్రితో పాటు లీగల్ పోరాటం చేస్తున్నట్లు రవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. తాను అతడి నమ్మి డబ్బులు ఇస్తే.. ఇంత మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
రెండేళ్లు కలసి ఉన్న స్నేహితుడు మోసం చెయ్యటంతో చాలా బాధపడినట్లు తెలిపాడు. ఆ డబ్బులు తిరిగి రావాలని తన భార్య ఉపవాసాలు చేసినట్లు. ప్రతీ రోజు పూజలు చేసిందని చెప్పాడు. ఇక రవి బిజీ షెడ్యూల్‌లు ఉన్నప్పటికీ కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నానని తెలిపాడు.





























