బిగ్ బాస్ సీజన్ 5 లో 12వ వారంలో యాంకర్ రవి అనూహ్యంగా బయటకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. అతడి ఎలిమినేషన్ ఫేక్ అంటూ బయట అతడి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. తను ఎలిమినేట్ అవుతానని అస్సలు అనుకోలేదంటూ చెప్పుకొచ్చాడు రవి. బిగ్ బాస్ ఇంటి నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఏ ఒక్కరూ కూడా ఊహించలేదు.

యాంకర్ రవితో పాటు, బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెట్లు సైతం ఎవ్వరూ ఎలిమినేషన్‌ను ఊహించలేదు. టాప్ 5లో ఉండాల్సిన కంటెస్టెంట్ చివరి వరకు పోటీలో ఉండాల్సిన రవి ఇలా బయటకు రావడం ఏంటని అంతా ఆలోచనలో పడ్డారు. రవి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఏ బేస్ పై ఉంటుంన్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.. మొన్న టాస్క్ లో 100 శాతం ఇచ్చి ఆడుతున్న విశ్వా బయటకు వచ్చాడు.. అయితే అతడికి బయట ఫ్యాన్స్ లేరనుకుందాం.
మరి యాంకర్ రవి విషయంలో బయట ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయినా అతడు ఎలిమినేట్ అయ్యాడు. దీనికి గల కారణం ఏంటి.. అంటూ ప్రశ్నిస్తున్నారు రవి ఫ్యాన్స్. ఇక బయట ఫ్యాన్ ఫాలోయింగ్.. సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన తీరు చూసి షాక్ అయ్యాడు రవి. తన ఎలిమినేషన్ పై అనుమానాలు ఉన్నాయంటూ.. ఇన్ స్టా వేదికగా లైవ్ లోకి వచ్చి మరీ చెప్పాడు.
బిగ్ బాస్ పై అతడు పరోక్షంగా ఆరోపణలు చేశాడు. బిగ్ బాస్ ఇంట్లో జరిగేది ఒకటి బయటకు చూపించేది ఒకటి అని రవి అన్నాడు. తాను చేసింది ఒకటి.. బయటకు మాత్రం ఇంకోలా ప్రొజెక్ట్ చేశారంటూ రవి అన్నాడు. ఇక హౌస్ లోకి వెళ్లేముందు తనపై మీమ్స్ , ట్రోల్స్ చేయండంటూ చెప్పానని.. కానీ తన ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఒక్క రెండు వేల రూపాయలు ఇస్తే.. వాళ్ల ఫ్యామిలీ గురించి కూడా ట్రోల్స్ చేసే బ్యాచ్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

































