తెలుగులో ప్రసారం అవుతున్న అతి పెద్ద రియాల్టీ షోలో మొదట 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. అందులో చాలామంది కొత్తవాళ్లు మాత్రమే ఉన్నారు. తెలిసిన వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇక అందులో ఎక్కువగా యాంకర్ రవి ప్రతీ ఒక్కరికీ సుమపరిచితమే.

యాంకర్ గా తన ట్యాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. దాదాపు అతడు టాప్ 5లో ఉంటాడని.. అందరూ అనుకున్నారు కానీ చివరకు వచ్చే సరికి 12వ వారంలో అనూహ్యంగా బయటకు వచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ షాక్ కు గురవ్వడంతో పాటు.. ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఇక యాంకర్ రవితో పాటు.. తన కటుంబసభ్యులను కూడా యూట్యూబ్..ప్రైవేట్ వెబ్ సైట్లలో నెగెటివ్ కామెంట్లు చేశారనే కారణంతో అతడు పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

నెగిటివ్ గా మాట్లాడే వారికి.. ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసేవారికి ఇది ఆరంభం మాత్రమే అని.. వారిపై ఇకమీదట చర్యలు అధికంగా ఉంటాయని కూడా యాంకర్ రవి హెచ్చరించాడు. ఇక దీనిపై రవి భార్య నిత్యా మాట్లాడుతూ.. రవి హౌజ్ లోకి వెళ్లకముందే.. రవిపై ట్రోలింగ్స్ చేస్తారని.. నువ్ స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పాడని తెలిపాడు. రవికి సంబంధించి ఏ వీడియో చూసిన విపరీతంగా ట్రోల్స్ చేశారని.. తాను అవి తీసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు.
తమకు సంబంధించి సోషల్ మీడియా అకౌంట్లలో.. రవి అకౌంట్లోనే కాకుండా.. నా అకౌంట్లో.. తన కూతురు అకౌంట్లో కూడా విపరీతంగా ట్రోల్స్ చేశారని..చాలా వరకు అవి డిలీట్ చేశానని చెప్పారు. ఫేక్ పేజ్ లు క్రియేట్ చేసి కామెంట్లు పెట్టేవారని వాపోయింది. ధైర్యం ఉంటే.. సొంత పేజ్ నుంచి పోస్ట్ లు పెట్టండి అంటూ చెప్పారు. మీరు ఎవరికైనా సపోర్టు చేస్తే చేయండి కానీ.. ఇలా వేరే వాళ్లకు కించపరిచే విధంగా పోస్టులు ఎదుకు పెడుతున్నారు.. తన ఫ్యామిలీ అంత తప్పు ఏం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు నిత్యా సక్సేనా.






























